Begin typing your search above and press return to search.
వీరంతా టీడీపీలో చేరుతారా..!
By: Tupaki Desk | 25 Feb 2016 11:30 AM GMTవైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్న టీడీపీ ఇక ఆ వేగం మరింత పెంచాలని అనుకుంటోందట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి కనీసం 20 మందిని చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. వైఎస్సార్ సీపీ నుంచి మొత్తంగా కనీసం 25 మందికి పసుపు కండువాలు కప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బలహీన పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించే పనిలో పడింది. వైసీపీ ఎమ్మెల్యేల వ్యక్తిగత వివరాలు, వారి ఆర్ధిక స్థితిగతులు, అవసరాలపై ఆరా తీస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ల కోసం డబ్బులు ఇచ్చి, ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఎలాంటి ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తిస్తోంది.
వలసలపై దృష్టి సారిస్తోన్న టిడిపి నాయకత్వం మొదట జగన్ సొంత కడప జిల్లాపై సీరియస్ గా దృష్టి పెట్టింది. అందులో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అయిన నారాయణరెడ్డి ఇప్పటికే టిడిపిలో చేరారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి - మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా పార్టీలో చేరుతారని టిడిపి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అదే జిల్లాకు చెందిన మాజీ ఎంపి మైసూరారెడ్డి ఈ నెల 28న టీడీపీలో చేరుతారని సమాచారం.
కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి - ఐజయ్య - రాజశేఖర్ రెడ్డి - సురేష్ కూడా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. వీరంతా అసెంబ్లీ సమావేశాల్లోగానే చేరుతారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అనంతపురం జిల్లాలో కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు పదునుపెడుతున్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి - చాంద్ బాషా పేర్లు టిడిపి వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంత్రి పరిటాల సునీత ఎమ్మెల్యే చాంద్ బాషాతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే - ప్రస్తుత టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ నిన్నటి వరకూ విశ్వేశ్వర్ రెడ్డి రాకను వ్యతిరేకించారని, తాజాగా ఆయన కూడా అంగీకరించడంతో విశ్వేశ్వర్ రెడ్డి చేరికకు మార్గం సుగమమయిందని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాధ్ రెడ్డి - మదనపల్లి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గుంటూరు ఎమ్మెల్యే మస్తాన్ - బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పేరూ చేరికల జాబితాలో వినిపిస్తోంది. అయితే.. సుజయకృష్ణ మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ - నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేర్లూ వినిపిస్తున్నాయి. నల్లపురెడ్డితో ఆయన బావ జెసి ప్రభాకర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు కూడా సైకిల్ ఎక్కుతారన్న ప్రచారం టిడిపి వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ - సురేష్ కుమార్ - డేవిడ్ రాజు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో గొట్టిపాటి రవికుమార్ చాలాకాలం నుంచి టిడిపి నాయకత్వంతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆయన నివాసంలో జగన్ ఫొటోలు, ఫ్లెక్సీలు కూడా తొలగించారు. వీరు ముగ్గురూ అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే పార్టీలో చేరవచ్చంటున్నారు. మొత్తానికి ఇలా ప్రతి జిల్లాలోనూ కొందరు వైసీపీ పేర్లు వినిపిస్తున్నాయి.