Begin typing your search above and press return to search.

‘పప్పు’ అంటూనే ప్రచారం కల్పిస్తున్న వైసీపీ

By:  Tupaki Desk   |   4 May 2020 3:40 PM IST
‘పప్పు’ అంటూనే ప్రచారం కల్పిస్తున్న వైసీపీ
X
నారా లోకేష్ బాబు.. మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు.. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఏపీ ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. అయితే ఈ భావి టీడీపీ అధినాయకుడి శక్తి సామర్థ్యాలు చాలా ప్రసంగాల్లో బయటపడ్డాయి. ఆయన వ్యవహరించిన తీరు కూడా ఆయనలోని నాయకత్వం లక్షణాలను బయటపెట్టాయి. దీంతో లోకేష్ ప్రత్యర్థులు ఆయనకు ‘పప్పు’ అంటూ సార్థక నామధేయం పెట్టి విమర్శలు మొదలుపెట్టారు. సోషల్ మీడియా కూడా అందిపుచ్చుకొని ఇప్పుడు ఏపీ పప్పు అంటే లోకేషే వచ్చేలా చేస్తున్నాయి.

నారా లోకేష్ కు జనాల్లో పట్టు లేకపోయినా వైసీపీ నాయకులే అనవసరంగా ప్రచారం కల్పిస్తున్నారని వైసీపీ కీలక నాయకులే అంటున్నారు. సరిగా నియోజకవర్గం పేరు కూడా పలకని లోకేష్ కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఎందుకు ఆయనను హీరోను చేస్తున్నారు అని క్షేత్రస్థాయిలో నిజమైన కార్యకర్తలు ఆడిపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ కు అతడి పిల్ల చేష్టలు.. ట్వీట్ లతో వైసీపీ నాయకులు రిప్లై చేస్తుంటే అతడు ఇంకా రెచ్చిపోయి ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడని అంటున్నారు.

చంద్రబాబు, లోకేష్ బాబు ఇద్దరూ హైదరాబాద్ లో కూల్ గా కూర్చొని వైసీపీ ప్రభుత్వం మీద బండలు వేస్తుంటే వారి మాయలో వైసీపీ పెద్దలు పడి వాళ్లకి రిప్లైలు ఇస్తూ వాళ్ల బురద వీళ్లు కడుగుతున్నారు అని టీడీపీ వాళ్లు పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవల్లో ఆక్షేపిస్తున్నారు. మా బాబుకి అంత సీన్ లేకపోయినా.. మా లోకేష్ దెబ్బకు వైసీపీ వాళ్లు ట్రాప్ లో పడి మాకు మేలు చేస్తున్నారు అని టీడీపీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు

అదేవిధంగా జాతీయ మీడియాను కూడా టీడీపీ మేనేజ్ చేస్తోంది అని కూడా అంటున్నారు.. ఎందుకు అంటే లోకేష్ ట్వీట్ లకు జాతీయ మీడియాలో కూడా చర్చ చేస్తోంది అంటే టీడీపీ మేనేజ్ మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు.

ఇలా సీన్ లేని లోకేష్ ను సీన్లోకి తెచ్చి వైసీపీ పెద్దలే పెంచిపోషిస్తున్నారనే చర్చ అంతటా మొదలైంది. పప్పును కాస్తా ఉప్పుగా, నిప్పుగా తయారు చేస్తున్న వైసీపీ నేతల తీరు బాగాలేదంటున్నారు. లోకేష్ కు లోకేష్ శత్రువని..ఆయనను అలా వదిలేస్తే ఆయన పరువు ఆయనే తీసుకుంటారని.. వైసీపీ పెద్దలు కామ్ గా ఉంటే చాలని పలువురు వైసీపీ ముఖ్యలు అభిప్రాయపడుతున్నారు.