Begin typing your search above and press return to search.
అఖిల ప్రియ గజినీగా మారిపోయిందట
By: Tupaki Desk | 3 July 2017 8:32 AM GMTనంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి భూమా అఖిల ప్రియ మాటలు చూసి విని అక్కడి జనానికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదట. ఎమ్మెల్యే టికెట్ కోసమే శిల్పా మోహన్ రెడ్డి వైకాపాలో చేరారంటూ అఖిల చేస్తున్న ఆరోపణలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. శిల్పాకు విలువల్లేవని అనే అఖిల ప్రియ తమకెంత విలువలు ఉన్నాయో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. అసలు అఖిల ప్రియ ఏ పార్టీ నుంచి గెలిచింది... ఎందుకోసం టీడీపీలోకి వచ్చింది... ఎలా మంత్రి అయింది... తన చెల్లెలికి టిక్కెట్ ఇప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందనేది అందరికీ తెలుసని... శిల్పావైపు వేలెత్తి చూపుతున్న అఖిల ప్రియ తన వైపు ఎన్ని వేళ్లు ఉన్నాయో చూసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు.
అఖిల, ఆమె తండ్రి భూమా నాగిరెడ్డిలు 2014లో వైసీపీ టిక్కెట్ పై గెలిచారు. ఆ తరువాత పదవుల కోసం టీడీపీలోకి జంప్ చేశారు. అయితే... అలా ఫిరాయించినా కూడా వారు వైసీపీ నుంచి గెలిచిన పదవులుకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయలేదు. రాజీనామా చేసి పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతోనే తండ్రీకూతుళ్లిద్దరూ వైసీపీ చలవతో దక్కిన ఎమ్మెల్యే హోదాలో కంటిన్యూ అయిపోయారు.
ఆ తరువాత నాగిరెడ్డి హఠాన్మరణంతో అఖిల ప్రియకు చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు తమ కుటుంబానికే చెందిన బ్రహ్మానంద రెడ్డికి ఆమె టీడీపీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఇలా వైసీపీ నుంచి గెలిచి ఆ హోదాతోఫిరాయించి ఇన్ని సాధించుకున్న అఖిల ప్రియకు ఇన్ని ఆరోపణలు చేసే అర్హత ఎక్కడుందని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అఖిల ప్రియ గతం మర్చిపోయి గజనీలా మారిపోయిందా ఏంటి అంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/