Begin typing your search above and press return to search.
మీడియాపాయింట్ నుంచీ తరిమేశారు..
By: Tupaki Desk | 19 March 2015 9:03 AM GMTఅసెంబ్లీలో గొడవ చేస్తే సస్పెండ్ చేస్తారు.. బయటకు పంపిస్తారు.. వెళ్లకపోతే మార్షల్స్‌తో గెంటిస్తారు. కానీ, వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం అంతకుమించి పరాభవం ఎందురైంది. అసెంబ్లీ నుంచి 8మంది ఎమ్మెల్యే సస్పెండ్ అయిన తరువాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మీడియాపాయింట్ వద్ద చేరి అదేపనిగా నోటికి పనిచెప్పడం ప్రారంభించారు. దీంతో మార్షల్స్ వారిని అక్కడి నుంచి కూడా పంపించే ప్రయత్నం చేశారు.
కొద్ది రోజుల క్రితం సస్పెండైన తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ శాసనసభ లోపలికి రానివ్వకుండా మార్షల్స్ అడ్డుపడినట్లుగానే ఏపీ శాసనసభలో వై.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీడియా పాయింట్ నుంచి కూడా మార్షల్స్ పంపించడం విశేషం. అయితే, గతంలో ఎప్పుడూ ఇలా మీడియా పాయింట్ నుంచి ఎమ్మెల్యేలను పంపించేయడానికి మార్షల్స్‌ను ఉపయోగించడలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మీడియా పాయింట్ నుంచి కూడా బహిష్కరణకు గురై వైసీపీ ఎమ్మెల్యేలు కొత్త రికార్డు సృష్టించినట్లయింది.