Begin typing your search above and press return to search.

పూల‌దండ వేసేందుకు గేట్లు ఎక్కాలా?

By:  Tupaki Desk   |   18 Dec 2015 12:47 PM GMT
పూల‌దండ వేసేందుకు గేట్లు ఎక్కాలా?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు శుక్ర‌వారం అనుస‌రించిన వైఖ‌రి ప‌లుమార్లు చ‌ర్చ‌నీయాంశంగా మార‌టంతో పాటు.. ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. స‌భ‌లోనే కాదు.. స‌భ బ‌య‌టా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు అనుచిత వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. వీటిని జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేలు ఖండించ‌టం మ‌రో వ్య‌వ‌హారం.

కాల్ మ‌నీ మీద చ‌ర్చ జ‌ర‌గాలంటూ అంబేడ్క‌ర్ మీద చ‌ర్చ‌ను అడ్డుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు.. త‌మ వైఖ‌రితో డ్యామేజ్ జ‌రిగింద‌న్న భావ‌న‌కు గురైన‌ట్లుగా చెబుతున్నారు. ఈ డ్యామేజ్ ను కంట్రోల్ చేయ‌టానికి వీలుగా.. అసెంబ్లీలోని అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి దండ‌లు వేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఓప‌క్క స‌భ‌లో ర‌క‌ర‌కాల కార‌ణాలు చూపించి.. అంబేడ్క‌ర్ మీద స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గ‌కుండా అడ్డుకున్న ఏపీ విప‌క్షం స‌భ బ‌య‌ట మాత్రం అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసేందుకు చాలానే సాహ‌సాలుచేశారు.

దురుసు వ్య‌వ‌హార‌శైలితో త‌మ‌కు చెడ్డ‌పేరు రాకూడ‌ద‌ని భావించారో ఏమో కానీ..అంబేడ్క‌ర్ పై చ‌ర్చ‌కు ఓకే చెప్ప‌ని వైఎస్ జ‌గ‌న్ పార్టీ నేత‌లు.. స‌భ‌లో స‌స్పెన్ష‌న్ కు గురైన త‌ర్వాత మాత్రం అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌దండ వేయ‌టానికి ప్ర‌య‌త్నించారు. అయితే.. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్రిక్త ప‌రిస్థితి చోటు చేసుకుంది. పోలీసుల క‌న్నుగ‌ప్పి అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌దండ వేసేందుకు ప‌లువురు ప్ర‌య‌త్నిం చారు. దీంతో ఒక్క‌సారి గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో కొంద‌రు జ‌గ‌న్ బ్యాచ్ ఎమ్మెల్యేలు గేట్లు దూకి లోప‌లికి ప్ర‌వేశించి పూల‌మాల‌లు వేశారు. ఓప‌క్క స‌భ‌లో అంబేడ్క‌ర్ గురించి మాట్లాడేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్ బ్యాచ్‌.. అసెంబ్లీ బ‌య‌ట మాత్రం అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసేందుకు ప‌డిన శ్రమ చూసిన వారి నోట మాట రాని ప‌రిస్థితి.