Begin typing your search above and press return to search.
కోడెలకు చిక్కులు తప్పవా?
By: Tupaki Desk | 29 Jun 2016 7:29 AM GMTఒక టీవీ ఇంటర్వ్యూ ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్ కు కొత్త కష్టం తెచ్చిపెట్టినట్లైంది. టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలపై ఏపీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయటంతో ఇప్పుడు ఆయనకు చిక్కులు తప్పేలా లేవన్న మాట వినిపిస్తోంది. తాజాగా స్పీకర్ కోడెల మీద రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయటమే కాదు.. ఆయన శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయటం చూసినప్పుడు..ఈ పరిణామాలు కోడెలకు ఇబ్బందిగా మారనున్నాయన్న మాట వినిపిస్తోంది.
ఇటీవల ఒక ఛానల్ లో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నికల్లో ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందంటూ అనూహ్యంగా ఓపెన్ అయిపోయారు. తాను ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసినప్పుడు పెట్టిన ఖర్చుకు తాజాగా జరిగిన ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుకు సంబంధం లేదంటూ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏకంగా రూ.11.5కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పుకోవటం సంచలనంగా మారింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక సీనియర్ రాజకీయ నేత కెమేరా సాక్షిగా మరీ అంత ఓపెన్ కావటమా? అని కోడెల మాటలు విన్న వారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి.
దీన్ని అవకాశంగా తీసుకున్న ఏపీ విపక్షం కెడెల మీద దాడిని షురూ చేసింది. స్పీకర్ గా వ్యవహరిస్తున్న ఆయనపై వెంటనే వేటు వేయాలని.. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోడెల వ్యాఖ్యలపై మొదట్లో కొన్నివిమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత కాలంలో మౌనంగా ఉండిపోయారు. తాజాగా కోడెల మాట్లాడిన వీడియో ఫుటేజ్ ను.. ఫిర్యాదును కలిపి ఎన్నికల అధికారికి అందించారు.
ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానం కోసం పోటీ చేసే అభ్యర్థి రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. కానీ.. తాను రూ.11.5కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేసినట్లుగా కోడెల స్వయంగా తనకు తానే చెప్పటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తాజా పరిణామాలు కోడెలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. సాంకేతికంగా ఆయనపై ఉన్న ఫిర్యాదుకు తగిన ఆధారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందించినట్లే చెప్పొచ్చు. మరి.. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.