Begin typing your search above and press return to search.
ఉద్యోగులు చేసిన తప్పులతో ఇద్దరు 'తమ్ముళ్లు' సేఫ్!
By: Tupaki Desk | 25 May 2019 6:01 AM GMTఉద్యోగులు చేసిన తప్పులు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులకు వరంగా మారాయి. కఠినంగా ఉండే ఎన్నికల నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాల్సిన ఉద్యోగులు అశ్రద్ధతో చేసిన తప్పుకారణంగా రెండు ఎంపీ స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయేలా చేసింది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్ని తూచా తప్పకుండా పాటించటం.. ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఉద్యోగులు చేసిన చిన్న చిన్న తప్పులతో పెద్ద ఎత్తున ఓట్లు చెల్లకుండా పోయిన పరిస్థితి. దీంతో.. ఓటమి అంచున నిలిచిన ఇద్దరు టీడీపీ ఎంపీ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్.. శ్రీకాకుళంటీడీపీ ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు బరిలో నిలిచి గెలిచిన సంగతి తెలిసిందే. వారిద్దరు స్వల్ప మెజార్టీలతో బయటపడ్డారు. గల్లా జయదేవ్ 4205 స్వల్ప మెజార్టీ రాగా.. రామ్మోహన్ నాయుడికి 6653 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉద్యోగులు వేసే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను జారీ చేసే అధికారులు చేసిన తప్పులే వీరు గెలిచేలా చేశాయి. పోస్టల్ బ్యాలెట్ పంపే కవర్ మీద బ్యాలెట్ పేపర్ వరుస నెంబరును నమోదు చేయకపోవటంతో వాటిని కౌంటింగ్ లోకి పరిగణలోకి తీసుకోలేదు. దీంతో..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో.. ఇద్దరు టీడీపీ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.