Begin typing your search above and press return to search.
నంద్యాల ఉప ఎన్నిక కోసం వైసీపీ భలే ప్లాన్!
By: Tupaki Desk | 16 April 2017 11:31 AM GMTనంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం ఇందుకోసం పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఉప ఎన్నికల బరిలో పార్టీ తరపున ముస్లిం అభ్యర్థిని బరిలో నిలుపాలని వైసీపీ అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వైకాపా నంద్యాల ఇన్ చార్జిగా పనిచేస్తున్న యువనేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానానికి సమాచారం ఇస్తున్నప్పటికీ వైకాపా మాత్రం ముస్లిం అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు చెప్తున్నారు. బలమైన పోటీ దారుడిని ఎదుర్కునేందుకు ఈ ఎత్తుగడను తెరమీదకు తీసుకువస్తున్నట్లు సమాచారం.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి గతంలో ఎస్‌బీ నబీసాహెబ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ కూడా మూడు సార్లు నంద్యాల అసెంబ్లీ నుండి గెలిచి పలు పదవులు పొందారు. అలాగే ఇతర పార్టీల తరపు నుండి కూడా ముస్లిం అభ్యర్థులు పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మగ్బుల్ హుసేన్ నంద్యాల అసెంబ్లీకి పోటీ చేయగా మరికొంత కాలానికి మాజీ మున్సిపల్ చైర్మన్ డా. ఎస్ ఎండి నౌమాన్ కూడా అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ పరిధిలో ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ఆర్థిక స్థోమతతో పాటు అంగబలం - కార్యకర్తలు - అనుచరుల బలం ఉన్న నేతలు ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ ముస్లిం అభ్యర్థి కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం నంద్యాల అసెంబ్లీ ఇన్ చార్జి బాధ్యతలను ముస్లిం అభ్యర్థికి అప్పగించాలని పట్టణంలోని ఓ విద్యావేత్తను పలుమార్లు సంప్రదించిన విషయం విధితమే. వైకాపాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు అప్పట్లో నంద్యాలకు వచ్చి ముస్లిం విద్యావేత్తతో పలుమార్లు సంప్రదింపులు జరపగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో అనివార్యమైన ఉప ఎన్నికలో ఆయనతో బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సదరు విద్యావేత్తకు అన్ని రకాల హంగులు ఉన్నప్పటికి ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు వెనుకా, ముందు ఆలోచిస్తున్నారు.
కాగా స్థానిక రాజకీయాలను చూస్తే ఏపీపీఎస్ సీ బోర్డు మెంబరుగా పనిచేసిన డా. ఎస్ ఎండి నౌమాన్ కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్న వ్యక్తి. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పదవులను అధిష్టించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ కూడా వైకాపాలోకి వెళ్లాలా, లేక తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలా అన్న విషయంపై ఊగిసలాగ ధోరణిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన అనుచరులు సమావేశమై తమ నాయకునికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎంపిక చేయాలని, లేనిపక్షంలో నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండు సార్లు నంద్యాల పార్లమెంటుకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికి నిరుత్సాహం చెందక తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు ఏదోరకంగా ఎమ్మెల్సీగా నైనా ఎంపిక చేస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇదే సమయంలో ఎన్ ఎండి ఫరూక్ తో కూడా వైకాపా నేతలు ఆ పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఫరూక్ కుమారులు వైకాపాలోకి వెళ్లేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో వైకాపా టికెట్ ముస్లిం అభ్యర్థికి ఇస్తారా? లేక ఇన్ చార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? అన్న చర్చ సాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/