Begin typing your search above and press return to search.
వైసీపీ సీనియర్ మంత్రికి జనసేనతోనే తంటా...?
By: Tupaki Desk | 15 Jan 2023 6:30 AM GMTవైసీపీలో ఆయన సీనియర్ మంత్రి. మూడున్నర దశాబ్దాల రాజకీయం ఆయనది. ఆయనే విజాయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ. తండ్రి వైఎస్సార్ క్యాబినెట్ లో కొడుకు జగన్ మంత్రివర్గంలో పూర్తి కాలం పనిచేసిన ఘనత ఆయన సొంతం.2004లో ఫస్ట్ టైం చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రివర్గంలో చేరారు. 2009లో కూడా వైఎస్సార్ వేవ్ లో రెండవసారి గెలిచి మంత్రి అయ్యారు.
వైఎస్సార్ మరణం తరువాత ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు వినిపించింది. ఆయన ఉమ్మడి ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2014లో విభజన ఏపీలో కాంగ్రెస్ తరఫున చీపురుపల్లిలో పోటీ చేసి వైసీపీని మూడవ ప్లేస్ లోకి నెట్టినా ఓటమి తప్పలేదు. బొత్స బలం చూసి జగన్ ఆయన్ని పార్టీలోకి చేర్చుకున్నారు. అలా బొత్స వైసీపీలో చక్రం తిప్పుతూ వచ్చారు.
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ విజయనగరం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం తొమ్మిది సీట్లను కైవశం చేసుకుంది. ఎంపీ సీటు ఆ పార్టీకే దక్కింది. బొత్స తిరుగులేని అధికారాన్ని సంపాదించారు. అయితే నాలుగేళ్లుగా బొత్స మంత్రిగా ఉంటే విజయవాడ లేకపోతే విజయనగరంలో ఉంటున్నారు. తప్ప చీపురుపల్లిలో మాత్రం పెద్దగా ఉండడంలేదు. దాంతో బొత్స నియోజకవరంలో కొంత వర్గ పోరు మొదలైంది.
ఇక మాజీ మంత్రి కిమిడి మృణాళిని చీపురుపల్లిలో 2014లో గెలిచారు. 2019లో ఆమె రాజకీయ వారసుడు కుమారుడు అయిన కిమిడి నాగార్జున టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. ఇక కిమిడి నాగార్జున మరోసారి అక్కడ నుంచే పోటీకి సిద్ధం అంటున్నా చంద్రబాబు మాత్రం ఆయన్ని విజయనగరం పార్లమెంట్ నుంచి పోటీకి దించాలని చూస్తున్నారని టాక్. దీంతో నాగార్జున పోటీ అన్నది అయోమయంలో పడింది.
మరో వైపు చూస్తే తెలుగుదేశానికి కిమిడి ఫ్యామిలీ బలంగా ఉంది. మరి ఆయన్ని తప్పిస్తే ఎలా అన్నదే చర్చగా ఉంది. ఇక ఈ పరిణామాల నేపధ్యంలో మెల్లగా జనసేన దూసుకువస్తోంది. చీపురుపల్లి సహా చాలా చోట్ల తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో వారి మద్దతుతో ఈసారి చీపురుపల్లిలో జెండా ఎగరేయడానికి జనసేన చూస్తోంది అని అంటున్నారు. ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అని అంటున్నారు.
ఆ మధ్య పవన్ కళ్యాణ్ విజయనగరం టూర్ చేసినపుడు పెద్ద ఎత్తున జనాలు వచ్చి నీరాజనాలు పలికారు. దాంతో విజయనగరం జిల్లాలో జెండా పాతేందుకు జనసేన సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. పొత్తులు కనుక కుదిరితే తెలుగుదేశం నుంచి చీపురుపల్లి సీటుని తీసుకుని మరీ మంత్రి బొత్స మీదనే పోటీకి దిగాలని జనసేన చూస్తోంది. అదే విధంగా తమ బేస్ ని కూడా పెంచుకోవడానికి జనసేన చురుకుగా పావులు కదుపుతోంది. ఒకవేళ పొత్తులు లేకపోతే ఒంటరిగా అయినా దున్నేయడానికి రెడీ అంటోంది. మొత్తానికి సీనియర్ మంత్రి సీట్లో గెలిచేది మేమే అంటోంది జనసేన.
ఈ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ సైతం జనసేన మీద విమర్శలు తగ్గించారు అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున సభ పెట్టి వైసీపీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేసినా బొత్స పెద్దగా రియాక్ట్ కాలేదని అంటున్నారు. మరి బొత్స మదిలో ఏముందో తెలియదు కానీ ఆయన జనసేనతో మనకెందుకు గొడవ అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా బొత్స చీపురుపల్లిని ఊడ్చేసేందుకు జనసేన తయార్ అన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.