Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడుకు మా ఫుల్ సపోర్టు: బొత్సా

By:  Tupaki Desk   |   14 April 2021 10:30 AM GMT
అచ్చెన్నాయుడుకు మా ఫుల్ సపోర్టు: బొత్సా
X
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిన్న టీడీపీపై, చంద్రబాబు, లోకేష్ లపై మాట్లాడినట్టున్న వీడియోలు రిలీజ్ అయ్యి ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. జగన్ అన్నా, వైసీపీ అన్నా ఒంటికాలిపై లేచే అచ్చెన్నాయుడు మనసులో టీడీపీపై కోపం ఈ స్థాయిలో ఉందా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు కామెంట్స్ మైనస్ అయ్యాయని అంటున్నారు.

తాజాగా ఈ వీడియోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అచ్చెన్నకు వైసీపీ మంత్రి బొత్స తన పూర్తి మద్దతు ప్రకటించారు.

‘అచ్చెన్నాయుడు తప్పు ఏమీ మాట్లాడలేదు. ఆయన లోకేష్ మీద చేసిన వ్యాఖ్యల్లో చాలా నిజమే ఉందని’ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

దీంతో అచ్చెన్న వ్యాఖ్యలను వైసీపీ తన ఆయుధంగా మారుస్తోందని.. టీడీపీ వేలితోనే ఆ పార్టీ కన్నుపై పొడుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అచ్చెన్న వ్యాఖ్యలపై టీడీపీ గుంభనమైన వాతావరణం ఉండగా.. దీన్ని వైసీపీ నేతలు మాత్రం హైలెట్ చేస్తూ పెట్రోల్ పోస్తున్నారన్న చర్చ సాగుతోంది.