Begin typing your search above and press return to search.
పండుగపూట బాబును అన్నారు సరే.. మీరు చేస్తుందేంటి పెద్దిరెడ్డి
By: Tupaki Desk | 16 Jan 2023 1:30 AM GMTజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుగులేని అధికారాన్ని వెలగబెడుతున్న కొందరి పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. ఎవరినైనా సరే ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టే అలవాటున్న జగన్.. కొద్ది మంది విషయంలో మాత్రం ఆ సూత్రాన్ని పాటించరని చెబుతుంటారు. ఆ జాబితాలోకే వస్తుంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు. జగన్ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మాటకున్న హవా అంతా ఇంతా కాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి పండుగ వేళ పుంగనూరులో టీడీపీకి చెందిన పలువురిని అరెస్టు చేయించటంపై మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు.
మంత్రి పెద్దిరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చేశారు చంద్రబాబు. ఈ భూమి మీద ఎక్కడున్నా తీసుకొస్తానని.. వదలనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తన సున్నితత్వాన్ని మాత్రమే చూశారని.. ఇకపై కఠినత్వాన్ని చూస్తారని.. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామని తేల్చేశారు. ''పండుగపూట మా కార్యకర్తల్నిజైల్లో పెడతారా? భవిష్యత్తులో నువ్వు ఎక్కడ ఉంటావో ఊహించుకో. నా రాజకీయ జీవితంలో ఇంత ఆరాచకాల్ని ఎప్పుడూ చూడలేదు. పోలీసుల్ని ఉపయోగించుకొని నేరాలు చేస్తున్నారు'' అని నిప్పులు చెరిగారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన పెద్దిరెడ్డి.. ''పండుగ పూట కుటుంబ సభ్యులతో గడపకుండా ముఖ్యమంత్రి జగన్ మీదా.. నా మీదా విమర్శలు చేయటం సబబు కాదు. పుంగనూరులో టీడీపీ నేతలు.. కార్యకర్తలు.. తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. దౌర్జన్యం చేశారు. ఇవన్నీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?'' అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాతో పాటు కుప్పంలోనూ ప్రగతి పనులు జరుగుతున్నాయన్నారు.
చంద్రబాబుకు పండుగపూటను గుర్తు చేసి.. కుటుంబంతో పాటు గడపాలన్న సూచన చేసిన పెద్దిరెడ్డి.. మరి తాను చేస్తుందన్నదేంటన్న మాట వినిపిస్తోంది. పండుగపూట కుటుంబ సభ్యులతో గడపకుండా విపక్షానికి చెందిన పార్టీ కార్యకర్తల్ని జైల్లో వేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాట అనే ముందు.. సలహా ఇచ్చే ముందు తాను కూడా వాటిని పాటించాల్సిన అవసరం పెద్దిరెడ్డి లాంటి వారిపైన ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు కదా?