Begin typing your search above and press return to search.
ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటున్న వైసీపీ మంత్రి గారు
By: Tupaki Desk | 8 Nov 2022 1:30 PM GMTఆయన సీనియర్ మోస్ట్ మంత్రి గారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆయన సీనియారిటీ చూసి రెండవ విడత విస్తరణలో జగన్ మంత్రి పదవిని ఇచ్చారు. అయితే మంత్రిగా ఆయన శాఖాపరమైన అంశాల కంటే ఇతర విషయాలనే ఎక్కువగా మాట్లాడుతారు అన్న పేరు కూడా ఉంది. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు. ఆయన తాజాగా జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.
మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని స్వయంగా మంత్రిగారే ఒప్పేసుకున్నారు. వైసీపీకి అసలు వన్ పర్సంట్ కూడా వ్యతిరేకత లేదు, మళ్లీ మేమే, 175 కి 175 సీట్లూ మావే అని ఒక వైపు ఆ పార్టీ వారు అంతా ఢంకా భజాయిస్తున్న నేపధ్యంలో ధర్మాన ధర్మంగా మాట్లాడి సర్కార్ గుట్టు విప్పేశారు. తాను చెప్పాలనుకుంటున్నది కూడా చెప్పేశారు. ఇంతకీ మంత్రి గారు ఏమన్నారు అంటే మా ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది.
అయితే అది కోరి మేము తెచ్చుకున్నది కాదు, మేము అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా వచ్చినదే అని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమాలు జనాలకు అర్ధం కావడానికి వాటి ఫలితాలు రావడానికి కొంత టైం పట్టవచ్చు. ఈ లోగా ఆ విషయంలో ఎంతో కొంత వ్యతిరేకత ఉండవచ్చు అని మంత్రి గారే చెప్పేశారు. అంటే ఫలితాలు ఎపుడు వస్తాయో జనాలకు ప్రభుత్వం చేస్తున్న మంచి ఎపుడు అర్ధమవుతుందో తెలియదు కానీ వ్యతిరేకత మాత్రం ఉందని ఆయన క్లారిటీగానే చెప్పేశారన్న మాట.
ఇక ఏపీలో రోడ్లు బాగులేవు అన్న దానికి కూడా ధర్మాన తనదైన శైలిలో సమర్ధించి మాట్లాడారు. రోడ్లు మా కంటే ముందు ఉన్న టీడీపీ అద్వాన్నంగా వేయబట్టే ఇపుడు ఇలాంటి పరిస్థితి ఉందని ఆయన అంటున్నారు. రోడ్డు ఒకసారి కనుక బాగా వేస్తే అయిదేళ్ల పాటు ఉండాలని, కానీ టీడీపీ వారు వేసిన రోడు నాణ్యతగా లేకపోవడం వల్లనే ఇపుడు పాడైపోయాయని అన్నారు. అంతే కాదు ఆయన కొన్ని తమాషా మాటలు కూడా చెప్పుకొచ్చారు.
రోడ్లు మేము ఏమైనా పాడు చేశామా, వాటికి ఎక్కడికక్కడ కన్నాలు పెట్టి నాశనం చేశామా అని మాట్లాడారు. రోడ్లు బాగాలేవు అంటే ఆ బాధ్యత తప్పు అంతా కూడా టీడీపీనని నిర్మొహమాటంగా వారి మీదకు నెట్టేశారు. సరే టీడీపీ వారు వేసిన రోడ్లు పాడైపోతే మూడేళ్ళుగా అధికారంలో ఉన్న వైసీపీ వాటిని ఎందుకు బాగు చేయదు అన్న ప్రశ్నకు మంత్రి గారు ఏం సమాధానం చెబుతారో మరి. అంటే రోడ్ల విషయం తమది కాదని తప్పుకుంటున్నరా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.
మూడు రాజధానుల విషయంలో కూడా ధర్మాన చెబుతున్నది వైసీపీ పెద్దలు చెబుతున్నదీ ఏమీ పొంతన లేకుండా ఉందనే అంటున్నారు. మూడు చోట్లా సమగ్రమైన అభివృద్ధి కోసం మూడు రాజధానులు అని వైసీపీ అంటూంటే మంత్రి గారు మాత్రం చాలా రోజులుగా అసలైన రాజధాని విశాఖ మాత్రమే అని చెప్పుకొస్తున్నారు. విశాఖ నుంచే పాలన జరుగుతుందని, విశాఖ ఒక్కటే ఏపీకి రాజధాని అని బల్లగుద్దుతున్నారు.
ఏడాదికి రెండు మూడు సార్లు మాత్రమే శాసనసభ జరుగుతుందని, అది అమరావతిలో ఉంటుందని, ఇక హై కోర్టు కర్నూల్ లో ఉంటుందని, అక్కడకి వెళ్ళేవారు పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండరని, అలా కనుక చూసుకుంటే విశాఖ మాత్రమే సిసలైన రాజధానిగా ఉంటుందని చెప్పేశారు. విశాఖ రాజధాని వద్దు అని మూడు జిల్లాలలో ఎవరూ అనలేదని, అవన్నీ అబద్ధాలు అని ఆయన అంటున్నారు.
విశాఖకు రాజధాని వస్తే అన్ని రకాలుగా వెనకబడిన మూడు జిల్లాలూ అభివృద్ధి చెందుతాయని ధర్మానా అంటున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని, అలాగే అనుబంధ పరిశ్రమలు వస్తాయని, ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, భూములకు విలువ పెరుగుతుందని ఆయన అంటున్నారు. మొత్తానికి ఏపీకి ఏకైక రాజధాని విశాఖ మాత్రమే సుమా అని ఆయన చెప్పడం వరకూ ఉత్తరాంధ్రావాసులకు బాగానే ఉన్నా అమరావతి వారికి రాయలసీమ వారికి అది మింగుడుపడని వ్యవహారమే అవుతుందని, ఈ రాష్ట్ర మంత్రి, వైసీపీ కీలక నేత తెలుసుకోకపోవడమే ఇక్కడ విడ్డూరం మరి.