Begin typing your search above and press return to search.

వైసీపీ లక్కీ మినిస్టర్ కి అసమ్మతి స్ట్రోక్

By:  Tupaki Desk   |   7 Jan 2023 2:30 AM GMT
వైసీపీ లక్కీ మినిస్టర్ కి అసమ్మతి స్ట్రోక్
X
సీదరి అప్పలరాజుకు లక్కీ మినిస్టర్ అనే చెప్పాలి. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఏడాది తిరగకుండానే మంత్రి అయ్యారు. అది లగాయితూ విస్తరణలో సైతం పదవి పోకుండా చూసుకున్నారు. టోటల్ గా నాలుగేళ్ళ మంత్రి అనిపించుకుంటున్నారు. ఎందరికి ఆ అదృష్టం వరిస్తుంది. 2017 వరకూ ఆయన రాజకీయంగా ఏమీ కారు. జగన్ పాదయాత్రలో పాదం కదిపి ఆయన కంట్లో పడి అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేతలను కాదని మరీ టికెట్ తెచ్చుకోగలిగారు

జగన్ చల్లని చూపుతో మంత్రి అయిన తరువాతనే అప్పలరాజు వైఖరి మారిపోయింది అని అంటున్నారు. అది కాస్తా చివరికి సొంత పార్టీలోనే కొండంత వ్యతిరేకతకు కారణం అయిందని, ఇపుడు సొంత నియోజకవర్గం పలాస నడిబొడ్డునే భారీ మీటింగ్ కి అసమ్మతి నేతలు రెడీ అవడంతో మంత్రి సీదరి అప్పలరాజుకు కళ్ళకు ఫ్యూచర్ కనిపిస్తోంది అని అంటున్నారు.

మంత్రి అయ్యాక ఆయన దూకుడు, తన మాటే నెగ్గాలన్న పంతం, ఏకపక్ష విధానాలు సీనియర్లను గౌరవించకపోవడం, పార్టీలో రెండు గ్రూపులను రెడీ చేసి ఎగదోయడం, ఇలా చాలా చేశారని చివరికి అవే బెడిసికొట్టి అప్పలరాజు చుట్టూ అసమ్మతి సెగ రాజుకునేలా చేస్తున్నాయని అంటున్నారు. మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకగా గొంతు కలిపిన నాయకులు అంతా పలాస కేంద్రంగా ఈ నెలాఖరులో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు అన్నది ఇపుడు వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది.

వచ్చే ఎన్నికల్లో అప్పలరాజుకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వవద్దని వారు డిమాండ్ చేయబోతున్నారుట. ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని చెప్పబోతున్నారుట. ఇక అప్పలరాజుకు టికెట్ రాకపోతే తమకే టికెట్ ఇవ్వాలని కూడా నాయకులు ఎవరి మటుకు వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు సోదరుడు జుత్తు నీలకంఠం టికెట్ రేసులో ఉన్నాట్లుగా తెలుస్తోంది.

అదే విధంగా పలాసా కాశీబుగ్గ మునిసిపల్ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్, మందని మండలానికి చెందిన డాక్టర్ దున్న శాంతరాం కూడా టికెట్ కావాలంటున్నారు. అసమ్మతి నాయకులు గత ఏడాది ఆగస్టు నెలలో పలాస మండలం కంబిరిగాం తోటలో మొదటిసారి మంత్రికి వ్యతిరేకంగా భేటీని నిర్వహించారు. ఆ తరువాత సెప్టెంబర్‌ 7న వజ్రపుకొత్తూరు మండలం శారదాపురంలో మరో మీటింగ్ పెట్టారు. అదే ఊపులో నవంబరు 27న మందస మండలం దున్నూరులో 300 మందితో సమావేశం నిర్వహించారు.

ఇపుడు పలాస పట్టణంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మరీ మంత్రికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించాలని అసమ్మతి నాయకులు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. అయితే మొదట్లో అసమ్మతిని లైట్ తీసుకున్న అప్పలరాజు ఇపుడు వారితో చర్చలకు రెడీ అంటున్నారు. రాయబేరాలు కూడా నడుపుతున్నారు. కానీ వారు మాత్రం ససేమిరా అనడంతో మంత్రి గారికి ఏమి చేయాలో పాలుపోవడంలేదు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే గడగ గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గారు బాగా వెనకబడినట్లుగా అధినాయకత్వం వద్ద నివేదికలు ఉన్నాయని అంటున్నారు. పనితీరు బాగులేకపోతే టికెట్ దక్కదని హెచ్చరికలూ ఉన్నాయని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలోనే అప్పలరాజు పరేషాన్ అవుతున్నారని తెలుస్తోంది.

మరి ఈ నెలాఖరు మీటింగుతో మంత్రి మీద వైసీపీలో అతి పెద్ద తిరుగుబాటు కనుక రేగితే దానికి పూర్తి బాధ్యత ఆయనే వహించాలని అంటున్నారు. అదంతా అయన చేజేతులా చేసుకున్నదే అని అంటున్నారు. మొత్తానికి లక్కీ గా పాలిటిక్స్ లోకి వచ్చి అందలాలు ఎక్కిన అప్పలరాజుకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని సొంత పార్టీలోనే గుసగుసలు పోతున్నారుట.