Begin typing your search above and press return to search.

అద‌ర‌గొట్టిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి.. అరెస్టు!

By:  Tupaki Desk   |   13 Jan 2020 5:44 AM GMT
అద‌ర‌గొట్టిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి.. అరెస్టు!
X
ఒక‌వైపు అమ‌రావ‌తి అంటూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆ ప్రాంతంలో అనుకూల ర్యాలీలు చేయిస్తూ ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడు త‌న‌ది జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయి అని చెప్పుకుంటూ.. ఆఖ‌ర‌కు మూడు నాలుగు గ్రామాల‌కు ప‌రిమితం అయ్యార‌నే విమ‌ర్శ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి. వికేంద్రీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ.. చంద్ర‌బాబు నాయుడు అంతా అమ‌రావ‌తిలోనే ఉండాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. త‌ను రాష్ట్రం మొత్తానికీ మాజీ ముఖ్య‌మంత్రి ని అన్న‌ట్టు గా గాక‌, అమ‌రావ‌తి కి మాత్రమే మాజీ సీఎం అన్న‌ట్టు గా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది మిగ‌తా ప్రాంతాల్లో టీడీపీ కి న‌ష్టం చేసే అంశ‌మే.

అయినా చంద్ర‌బాబు నాయుడుకు అమ‌రావ‌తే ప్ర‌ధాన‌మే అయి పోయింది. భారీ ఎత్తున భూముల వ్య‌వ‌హారాలు ఉండ‌టం, త‌న కుల ఆధిప‌త్యం ఉండ‌టం కోస‌మే చంద్ర‌బాబు నాయుడు అంత‌లా ప‌ట్టు ప‌డుతూ ఉన్నార‌ని ప‌రిశీలకులు అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు.

ఇక అమ‌రావ‌తి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా తెలుగుదేశం పార్టీ వ్య‌క్తులు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వారు క‌నబ‌డ‌టం లేదంటూ ఇటీవ‌ల కంప్లైంట్లు ఇచ్చారు. ముందుగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డిని టీడీపీ టార్గెట్ గా చేసుకుంది. ఆయ‌న క‌న‌బ‌డ‌టం లేదంటూ స్థానిక పోలిస్ స్టేష‌న్లో టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇలాంటి నేప‌థ్యంలో ఆళ్ల డైరెక్టుగా రంగంలోకి దిగారు. అమ‌రావ‌తి ప్రాంతంలో ఆయ‌న ర్యాలీ చేప‌ట్టారు.

అది మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా!

మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌కు అనుకూలంగా ఆళ్ల ఆధ్వ‌ర్యంలో తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక వ‌ద్ద ర్యాలీ చేప‌ట్టారు. ఆ ర్యాలీని సీఎం క్యాంపు ఆఫీస్ వ‌ర‌కూ కొన‌సాగిస్తున్న త‌రుణంలో అనుమ‌తి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కేను ఆరెస్టు చేశారు.

ఏదేమైనా అమ‌రావ‌తి నుంచినే అంతా సాగాలంటూ తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా ఉద్య‌మం న‌డుపుతున్న త‌రుణంలో.. ఆర్కే ఇలా అమరావ‌తిలోనే మూడు రాజ‌ధానుల అనుకూల ర్యాలీ చేయ‌డం గ‌మ‌నార్హం.