Begin typing your search above and press return to search.
చిత్తూరు జిల్లాలో సైకిల్..ఫ్యాన్ బలం సమానం
By: Tupaki Desk | 16 Jun 2016 9:49 AM GMTఆపరేషన్ ఆకర్ష్ ను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమదైన శైలిలో నడుపుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతల్ని కారు ఎక్కించేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజునే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని సైకిల్ ఎక్కించనుండటం తెలిసిందే. తాజా పరిణామంతో చిత్తూరు జిల్లాలో ప్రధాన పార్టీల బలాబలాలు సమానం కానున్నాయి. అదెలానంటే.. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని పలు జిల్లాల్లో టీడీపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని చేజిక్కించుకున్నా.. చంద్రబాబు సొంత జిల్లాలో మాత్రం ఆయన తన ప్రభావాన్ని చూపలేకపోయారు.
చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీ మాత్రం కేవలం ఆరు స్థానాలకే పరిమితం కానుంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీలోనిపలు జిల్లాలకు చెందిన జగన్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. చిత్తూరు జిల్లాకు చెందిన జగన్ పార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా పార్టీ మారకపోవటం గమనార్హం.
ఆ లోటును తీరుస్తూ తాజాగా పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు రెఢీ అయ్యారు.ఈ రోజు సాయంత్రం ఆయన టీడీపీలో చేరేందుకు ముహుర్తం పెట్టుకున్నారు. అమర్ నాథ్ రెడ్డి జాయినింగ్ తో చిత్తూరు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బలం ఏడుకు పెరగనుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల బలం ఏడుకు తగ్గనుంది. దీంతో.. ఇప్పటివరకూ చిత్తూరు జిల్లాలో అధికారపక్షం కంటే సీట్ల అధిక్యంలో ఉన్న జగన్ పార్టీ ఇకపై సరిసమానంగా ఉండనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు కానీ.. తన సొంత జిల్లాలో విపక్ష బలాన్ని చంద్రబాబు తగ్గించగలిగారన్న మాట.