Begin typing your search above and press return to search.
తన బెండు ఎవరూ తీయలేదంటున్న ఏపీ మంత్రి
By: Tupaki Desk | 2 Aug 2022 11:50 AM GMTఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలపై ఒంటి కాలితో లేచే వైఎస్సార్సీపీ నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబు.. వైఎస్ జగన్ రెండో విడత కేబినెట్ విస్తరణలో జలవనరుల శాఖ మంత్రిగా చాన్సు పట్టేశారు.
ఈ నేపథ్యంలో పోలవరంపై అంబటి రాంబాబు చేస్తున్న ప్రకటనలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఆ మాటకొస్తే అంబటి వ్యాఖ్యలన్నీ గతంలోనూ వివాదాస్పదమే. పవన్ కల్యాణ్ పైన, చంద్రబాబుపైన అంబటి ఘాటు వ్యాఖ్యలే చేశారు. పోలవరంపై ప్రశ్నలు అడుగుతున్న కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లపైనా ఇలాగే అంబటి ధ్వజమెత్తుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు అడ్డంగా దొరికితే ఎవరైనా వదిలిపెడతారా? ఆ పత్రికలు, టీవీ చానెళ్లు కూడా వదిలిపెట్టలేదు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను పలువురు తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని నిలదీశారు. రోడ్లు సరిగా లేవని ప్రశ్నించారు. దీనిపై అంబటి శివాలెత్తారు. మీరు టీడీపీ వారని.. టీడీపీ వాళ్లకు రోడ్లు వేసేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు ప్రముఖంగా ప్రచురించాయి. అంబటి రాంబాబు ప్రజలు గట్టిగా గునపం దింపారంటూ రాసుకొచ్చాయి. ఈ కథనాలపై తాజాగా అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. దుష్టచతుష్టయం తనపై ఎంతో ప్రేమ చూపుతుందని.. తనకోసం వాటిలో స్పేస్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ఎద్దేవా చేశారు.
తనను గడప గడపలో నిలదీసినవారు జనసేన, టీడీపీ వారేనని అంబటి ఆరోపించారు. ముందుగానే పక్కా ప్లాన్ ప్రకారం కొన్ని పత్రికలు, కొన్ని టీవీ చానెళ్లు కెమెరాలతో అక్కడ సిద్ధంగా ఉండి ప్రజలు తనను ప్రశ్నిస్తున్న వీడియోలను తెరకెక్కించారని మండిపడ్డారు.
గడప గడప కార్యక్రమంలో ప్రజలు నా బెండు తీశారని దుష్ట చతుష్టయం శునకానందం పొందుతోందని అంబటి ఘాటు విమర్శలే చేశారు. ఎవరికీ నా బెండు తీసేంత సీన్ లేదన్నారు. గడప గడపకు వెళ్లి అందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేసి వచ్చానని అంబటి స్పష్టం చేశారు. తనను తిట్టే ప్రయత్నంలో తనకు దుష్టచతుష్టయం మీడియాలో ప్రాధాన్యత కల్పించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని సెటైర్ వేశారు.