Begin typing your search above and press return to search.
అనిల్ : అందరూ ఒకవైపు పాపం ఆయన ? కాకాణి రాగం నెల్లూరు ప్రాంతం
By: Tupaki Desk | 21 April 2022 2:04 PM GMTఅయ్యో పాపం అని అనుకోవడంలో తప్పు లేదు. అయ్యో పాపం ఎంత చెడ్డ అని అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ఆయన చెడ్డ కాదు మంచి కాదు. అధినేతకు విధేయుడు అని చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే బెడిసికొట్టడంతో పరిణామాలు ఇప్పుడు అత్యంత సంక్లిష్టంగా తయారయ్యాయి. ఆ విధంగా ఆయన ఎవ్వరి వాడు.. కాదు ఒంటరి వాడు.. ఎవ్వరికీ చెందని వాడు..
డు డు డు వాట్ టు డు.. అని అనుకుంటున్నవాడు. ఆయనే నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నిన్నటి దాకా ఆయన మంత్రి. ఆయనేం చెబితే అది. జలవనరుల శాఖ బాధ్యతలు నుంచి తప్పుకున్నాక ఆయనకు, ఆ శాఖకు మధ్య బంధాలు తెగిపోయాయి. ఆ బంధాలే ముళ్లుగా మారిపోయాయి.
పూలున్న చోటే ముళ్లు.. కాదు కాదు పదవి అనేది ముళ్ల కిరీటం అని తెలుసుకోవడంలో అనిల్ కొంత ఇబ్బంది పడ్డారు.. పదవి పోయాక జగన్ కు భారం కాదు నేను బాధ్యత అని ఓ డైలాగ్ రాశారు ఆయన. అదే మాట ప్రెస్మీట్లలో పదే పదే చెబుతున్నారు. ఈ సింగిల్ లైనర్ విని అధినాయత్వం సంబర పడుతుందో లేదా ఇది కూడా నటన సంబంధం అయిన వ్యక్తిత్వంలో భాగం అని సర్దుకుపోతుందో ...
ఇక కాకాణి కూడా బాగానే సర్దుకుపోతున్నారు. కానీ ఆయన సర్దుకుపోతున్నదంతా ఆయన కోసం కాదు పదవి కోసం .. లేదా పదవి ఇచ్చిన అధికారం కోసం.. లేదా అధికారం ఇచ్చే గౌరవం కోసం..అందుకే అధినాయకత్వం చూసీ చూడని విధంగా ఉంటోంది.ఆయనకు ఇప్పుడు అంతా అయిన వారే అయ్యారు. కోటంరెడ్డి మొదలుకుని ఆనం రామ నారాయణ రెడ్డి వరకూ .. ఇంకా.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అనిల్ ను కాకుండా కాకాణికే మద్దతుగా ఉంటున్నారు.
నెల్లూరు జిల్లా ఇంఛార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కూడా అనిల్ కు విభేదాలు ఉన్నాయి కనుక ఆయన కూడా అనిల్ తో ఎడం ఎడం అనే విధంగానే ఉండనున్నారు. ఏ విధంగా చూసుకున్నా ఆయన ఒంటరి అన్నదే రుజువు. ఆఖరికి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఈ డ్రామాలో మంత్రి కాకాని వైపు నిలిచి హాయిగా అనిల్ కు చెక్ పెట్టారు. ఆ విధంగా గాలివానల కుదుపులో అనిల్ ఇక ఒంటరి !