Begin typing your search above and press return to search.
కీలక నియోజకవర్గంలో మరోసారి బాబాయ్ వర్సెస్ అబ్బాయి!
By: Tupaki Desk | 8 Jun 2023 7:00 PM GMTవైసీపీకి కంచుకోట జిల్లాల్లో ఒకటి.. నెల్లూరు. ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పదికి పది స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ విజయకేతనం ఎగురవేసింది. అలాంటి కీలకమైన జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి జెల్లకొట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ వారిని బహిష్కరించింది.
కాగా నెల్లూరు సిటీలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆయన అన్న కుమారుడు, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మధ్య పొసగడం లేదు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. స్వయంగా బాబాయి, అబ్బాయిలైన వీళ్లిద్దరూ మధ్య భేదాభిప్రాయాలతో పార్టీ కేడర్ తలపట్టుకుంటోందని అంటున్నారు.
ఇప్పటికే బాబాయి రూప్ కుమార్ యాదవ్, అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముఖంగానే పరోక్షంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. వైఎస్ జగన్ కు సైతం ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. మే 12న కావలిలో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ వీరిద్దరిని ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి కలిపారు. అనిల్ కుమార్ యాదవ్ విజయం కోసం పనిచేయాలని రూప్ కుమార్ కు సూచించారు. దీంతో అటు అనిల్, ఇటు రూప్ కుమార్ ఇద్దరూ సీఎం మాటకు తలాడించారు.
ఆ తర్వాత షరా మామాలుగానే మళ్లీ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రాజకీయాలు అయినా వదులుకుంటాను గానీ తన శత్రువులతో కలవబోనని వ్యాఖ్యానించారు. జగన్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని లేదంటే చేయబోనని ప్రకటించారు. 2009లో పీఆర్పీ అభ్యర్థి శ్రీధర కృష్ణారెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన అనిల్ కుమార్ 2014, 2019ల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి అనిల్ సిద్ధమవుతున్నారు.
అయితే ఇదే సమయంలో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ కూడా సీటు ఆశిస్తున్నారు. ఆయన తనకంటూ ఒక వర్గాన్ని పోషించుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీ తరఫున సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్లో జగనన్న భవన్ పేరిట సొంతంగా కార్యాలయాన్ని రూప్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ హాజరుకావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి రూప్ కుమార్ యాదవ్ అనుచరులు భారీగా హాజరయ్యారు. తద్వారా ఆయన తన బలాన్ని చాటుకున్నారని చెబుతున్నారు.
మరోవైపు స్థానిక ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ ను పిలవకుండానే రూప్ కుమార్ కార్యాలయాన్ని ప్రారంభించడం పట్ల అనిల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.