Begin typing your search above and press return to search.
చెవిరెడ్డికి చెవి మెలిపెడుతున్నారు
By: Tupaki Desk | 22 Jan 2016 7:58 AM GMTయథా రాజా తథా ప్రజ అన్న నానుడిని వైసీపీ నేతలు బాగా ఒంటపట్టించుకున్నట్లున్నారు. తమ అధినేత జగన్ తో తాము కూడా పోటీ పడాలన్న ఉద్దేశంతో ఎన్ని కేసులుంటే అంత గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. వారందరిలోనూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అయితే మరీ స్పెషల్... పోలీసులు కూడా ఆయన్ను ముప్పతిప్పులు పెట్టి ముప్ఫయ్యారు స్టేషన్లు తిప్పుతున్నారు.
చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఓ కేసులో రిమాండ్ లో ఉన్నారు. ఆయన్ను, ఆయనతో పాటు ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కూడా పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. జగన్ పరామర్శ పూర్తికాగానే పోలీసులు చెవిరెడ్డిని పీలేరు తీసుకెళ్లారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ జడ్జి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈలోగానే పీలేరు పోలీసులు చెవిరెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో విడిచి వెళ్లారు. మొత్తానికి ఒక చోట బెయిలు తెచ్చుకుంటే ఇంకోచోటికి తీసుకెళ్తూ చెవిరెడ్డిని పోలీసులు ఆడుకుంటున్నారు. మరి పీలేరు కేసులో కూడా చెవిరెడ్డి బెయిలు తెచ్చుకుంటే ఇంకేదైనా కేసులో బుక్ చేస్తారేమో చూడాలి.