Begin typing your search above and press return to search.

కేశినేని.. ఏపీ విజ‌య్ మాల్యానా?

By:  Tupaki Desk   |   10 April 2017 2:08 PM GMT
కేశినేని.. ఏపీ విజ‌య్ మాల్యానా?
X
తొంభైఏళ్లుగా సాగుతున్న వ్యాపారాన్ని ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీ మూసివేయ‌టం అంటే మాట‌లా? కేశినేని అన్న వెంట‌నే.. ట్రావెల్స్ అన్న‌ట్లుగా పేరున్న నాని.. ఉన్న‌ట్లుండి త‌న ట్రాన్స్ పోర్ట్ కంపెనీని ఎందుకు మూసేసినట్లు? రాత్రికి రాత్రి బోర్డు తీయించేసిన ఆయ‌న వైనంతో.. ఆయ‌న్ను న‌మ్ముకున్న ఉద్యోగుల సంగ‌తేంది? వారిని ఆదుకునేది ఎవ‌రు? లాంటి ప్ర‌శ్న‌ల‌తో పాటు.. అస‌లు.. అధికార‌పార్టీకి చెందిన ఎంపీ త‌న వ్యాపారాన్ని క్లోజ్ చేయ‌టం ఏమిట‌న్న సందేహం ఏపీలోని చిన్న పిల్లాడికి కూడా క‌లిగే పరిస్థితి.

ఇలాంటి సందేహాల‌కు త‌న వ్యాఖ్య‌ల‌తో స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నం చేశారుజ‌గ‌న్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి. బ్యాంకుల వ‌ద్ద వంద‌ల కోట్ల అప్పులు చేసిన కేశినేని నాని ఆ నిధుల్ని ఇత‌ర అవ‌స‌రాల‌కు మ‌ళ్లించార‌న్నారు. బ్యాంకుల వ‌ద్ద వంద‌ల కోట్ల అప్పు చేసిన నాని.. వాటిని చెల్లించ‌కుండా ఎగ‌నామం పెట్టార‌ని.. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌రో విజ‌య్ మాల్యా అవ‌తారం ఎత్తార‌ని విమ‌ర్శించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న‌తోనే త‌న ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. బ‌స్సుల‌త పేరుతో బ్యాంకుల నుంచి డ‌బ్బులు తీసుకున్న‌కేశినేని నాని.. ఆ మొత్తంతో స్టార్ హోట‌ల్‌ను క‌డుతున్న‌ట్లుగా చెప్పారు. బస్సుల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న డ‌బ్బుల్ని వ‌సూలు చేసేందుకు.. ఆయ‌న‌కు చెందిన బ‌స్సుల్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంద‌న్న డిమాండ్‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. కేశినేనికి చెందిన 170 బ‌స్సులు శుక్ర‌వారంరాత్రి నుంచి రోడ్ల మీద‌కు రావ‌టం మానేశాయి. త‌న బ‌స్సుల్ని ఇత‌ర ట్రావెల్స్ కుఅమ్మేశార‌ని.. ఇప్పుడాయ‌న దృష్టి కార్గో వ్యాపారం మీద ప‌డింద‌న్న మాటను చెబుతున్నారు. ఏమైనా.. బ్యాంకుల ద‌గ్గ‌ర కోట్లాది రూపాయిలు అప్పులు చేసి.. వాటిని తిరిగి చెల్లించ‌కుండా ఆ బ‌స్సుల్ని అమ్మేయ‌టం ఏమిటి? దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది. చెవిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై అధికార‌ప‌క్షం స‌మాధానం ఇవ్వ‌ని ప‌క్షంలో.. ఆయ‌న ఆరోప‌ణ‌ల్లో ఎంతోకొంత నిజం ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/