Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయని పని చేసిన జగన్ పార్టీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   14 Aug 2020 6:30 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయని పని చేసిన జగన్ పార్టీ ఎమ్మెల్యే
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు. కానీ.. ఎవరు చేయని పనిని తాజాగా ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారు. ఆయన చేసిన పని గురించి తెలిసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. ఆయనకు ఇంత ధైర్యమా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకూ ఆయన చేసిన పనేమిటంటే..

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా ప్రభుత్వం డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో 300లకు పైగా రోగులు చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల పరిస్తితి ఏమిటి. వారి స్పందన ఏమిటన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తానే స్వయంగా పీపీఈ కిట్ వేసుకొని.. ఆసుపత్రికి వెళ్లారు.

ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్ ను కలవటమే కాదు.. వారికి ఎలా వైద్యం అందుతుంది? సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు? లాంటి ప్రశ్నలతో పాటు.. రోగులకు ఆత్మస్థైర్యం కలిగించేలా వారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ ఆసుపత్రులను సందర్శించినట్లుగా ఆయన చెబుతున్నారు.

పలువురు రోగులను నేరుగా కలిసి.. మీరంతా త్వరలోనే కోలుకుంటారన్న మాట చెప్పి వారిలో ధైర్యాన్ని మరింత పెంచారు. పాజిటివ్ గా తేలిన వారు ఎవరూ వేదన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొత్తానికి ఏపీలోని మిగిలిన ఎమ్మెల్యేలకు తాను భిన్నమన్న విషయాన్ని చెవిరెడ్డి తన చేతలతొ చేసి చూపించారని చెప్పాలి. మరి.. ఏపీలోని మిగిలిన ఎమ్మెల్యేలు ఇదే బాట ఎప్పుడు పడతారో?