Begin typing your search above and press return to search.
చంద్రబాబు అతిథిగృహం అక్రమ కట్టడమా?
By: Tupaki Desk | 21 Nov 2015 9:30 AM GMTఏపీ సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలోని విజయవాడలో ఏర్పాటుచేసుకున్న అతిథి గృహం అక్రమ కట్టడమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది అక్రమ కట్టడం కాబట్టి దాన్ని కూల్చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామని సీఆర్ డీఏ కమిషనర్ చేసిన ప్రకటన నేపథ్యంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే మండిపడుతున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని, ముందు దానిని కూల్చివేయండని ధ్వజమెత్తారు. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట మీద చాలామంది పెద్దోళ్లు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలేనని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇవ్వక ముందు ఓ మాట, ఇచ్చాక మరోలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.
అయితే.. ఇంతకుముందు కూడా ఈ తరహా ఆరోపణలు రావడంతో చంద్రబాబు గతంలోనూ దానిపైన వివరణ ఇచ్చారు. తాను అన్నీ పరిశీలించే అతిథిగృహాన్ని ఎంపికచేసుకున్నానని... అది సక్రమ కట్టడమేనని కూడా చెప్పారు. అయితే.. మంగళగిరి ఎమ్మెల్యే తాజా ఆరోపణల నేపథ్యంలో టీడీపీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన కనిపించలేదు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.