Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా బాలకృష్ణతో వైసీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ!
By: Tupaki Desk | 12 Jan 2023 11:30 AM GMTఏపీలో అధికార వైసీపీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ వర్గంతో ఉన్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఇటీవల వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత, సీఎం జగన్ ను సైతం ఆయన కలిశారు.
అలాగే కొద్దిరోజుల క్రితం జగ్గయ్యపేటలో కార్తీక వనసమారాధన సందర్భంగా మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమారుడు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని.. వాటిని ఖండిస్తున్నట్టు తెలిపారు.
రాజధాని అమరావతి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం, కమ్మ సామాజికవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలపై వసంత నాగేశ్వరరావు ఇటీవల జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే కమ్మలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతోందని వసంత నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టిన సంగతి విదితమే.
వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. దీంతో ఆయన కుమారుడు మైలవరం ఎమ్మెల్యే తన తండ్రి వ్యాఖ్యలను ఖండించారు.
తిరిగే కాలు, మాట్లాడే నోరు ఊరుకోవన్నట్టు తన తండ్రి వ్యవహరిస్తుంటారని చెప్పుకొచ్చారు. అందువల్ల తన తండ్రిని ఆపలేనని తెలిపారు. ఆయన వెళ్లాలనుకున్న చోటుకు వెళ్తుంటారని.. మాట్లాడాలనుకున్నది మాట్లాడుతుంటారని వివరించారు. అందువల్ల ఆయన వ్యాఖ్యలను వైసీపీ కార్యకర్తలు, నేతలెవరూ పట్టించుకోవద్దని విన్నవించారు.
ముఖ్యమంత్రి జగన్‌తోనే తన ప్రయాణం కొనసాగుతుందని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేయమంటే చేస్తా, లేకుంటే పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. మైలవరంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తనను మారిస్తే ఆ అభ్యర్థికి మద్దతుగా తాను నియోజకవర్గంలో పనిచేస్తానని కూడా ఆయన వెల్లడించారు.
అయితే ఇటీవల కాలంలో వసంత కృష్ణప్రసాద్ వైసీపీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ చిత్రం వీర సింహారెడ్డి విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫ్లెక్సీలు మైలవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి.
మైలవరం నియోజకవర్గంలోని వెలగలేరు గ్రామంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వర్గీయులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. మొన్నామధ్య.. . గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన ఉయ్యూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఉయ్యూరు శ్రీనివాస్‌కి మద్దతుగా వసంత కృష్ణప్రసాద్. ప్రస్తుతం రాజకీయాల్లో ఉండాలంటే చుట్టూ పది మంది పోరంబోకుల్ని ఉంచుకోవాలని తీవ్ర కామెంట్స్ చేశారు. ప్రతిపక్షంలో కాదు, స్వపక్షంలో ఉంటూ.. వెన్నుపోటు పొడిచేవారిని సహించేదిలేదని ఘాటు వ్యాఖ్యలే చేశారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణతో ఎమ్మెల్యే ఫ్లెక్సీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.