Begin typing your search above and press return to search.
రేణు దేశాయ్ నోరు విప్పితే పవన్ సంగతి అంతేనట!
By: Tupaki Desk | 13 Feb 2020 6:30 AM GMTకర్నూలులో పాశవిక అత్యాచారం - హత్యకు గురైన ఓ బాలిక కేసు ఏపీలో పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘోరంపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వీరావేశంతో కర్నూలులో పర్యటించిన పవన్ కల్యాణ్....బహిరంగ సభలో బాధితుల పక్షాన నిలబడుతున్నట్లు తెగ ఊగిపోయారు. ఈ కేసును దిశ యాక్ట్ కింద చేర్చాలని - వైసీపీ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని స్పీచ్ ఇచ్చారు. అయితే, పవన్ కర్నూలు పర్యటనకు ముందే ఆ బాలిక కేసును సీబీఐకి ప్రభుత్వం అప్పగించింది. దీంతో, ఆ కేసును సీబీఐకి అప్పగించినట్లుగా బాధిత బాలిక తల్లిదండ్రులకు పేపర్లు చూపించాలంటూ పవన్ వీరావేశంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శలు గుప్పించారు.
ఆ బాలిక పై హత్యాచారం జరిగి మూడేళ్లయిందని - గత ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ ఈ విషయం పై ఏనాడూ ప్రశ్నించలేదని హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. తన గురువైన చంద్రబాబును ఇబ్బందిపెట్టడం పవన్ కు ఇష్టం లేదని - నేడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ....బాబే పవన్ కి బాస్ అని ఎద్దేవా చేశారు. బాధిత బాలిక పేరును బహిరంగంగా చెప్పకూడదని కూడా పవన్ కు తెలియదని - బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పవన్ కు కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. పవన్ కు తెలిసిందల్లా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమేనని ఎద్దేవా చేశారు.
పవన్‌కు ఏమాత్రం నిలకడ లేదని - ఆయనో పార్ట్ టైం పొలిటిషియన్ అని హఫీజ్ విమర్శించారు. గతంలో రాయలసీమే నా రాజధాని అన్న పవన్....తాజాగా కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ గా పవన్ అంగీకరించడం లేదని అన్నారు. ఏదో ఒక అంశంపై వీరావేశంతో ప్రసంగించిన తర్వాత ఆర్నెల్లపాటు షూటింగ్ కు వెళ్లిపోయే అజ్ఞాతవాసి పవన్ అని ఎద్దేవా చేశారు. పవన్ కు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని - పవన్ గురించి రేణుదేశాయ్ నోరు విప్పితే..దిశ యాక్ట్ కింద పవన్ కు చిక్కులు తప్పవని హఫీజ్ ఖాన్ అన్నారు.