Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే ఎఫెక్ట్: అక్కడ అధికారులు హడలి పోతున్నారా..?
By: Tupaki Desk | 12 Jan 2022 11:30 PM GMTఎమ్మెల్యే అంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. తన నియోజకవర్గంలో ఏం జరిగినా.. తన కనుసన్నల్లో నే జరగాలని.. తనకు తెలియాలని.. ఎవరి ఆధిపత్యాన్ని ఒప్పుకొనేది లేదని కూడా ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తూ ఉంటారు. ఇది ఏ పార్టీలో అయినా కనిపించే ఘటనే. ఎమ్మెల్యేగా ఉన్న వారు ఆమాత్రం కోరుకోవ డంలోనూ తప్పులేదనే భావన ఉంది. పైగా ప్రొటోకాల్ కూడా వర్తిస్తుంది కాబట్టి.. ఇలాంటి సహజంగానే ఉంటాయని అంటున్నారు. కానీ, వైసీపీకి చెందిన కీలక ఎమ్మెల్యే ఒకరు.. తన సత్తా చాటేందుకు దూకు డుగా ముందుకు సాగుతున్నారని.. పార్టీలోనే చర్చ జరుగుతుండడం గమనార్హం.
విజయవాడకు సమీపంలో ఉండే.. కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే ఒక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తొలి సారి విజయం దక్కించుకున్న ఈయన.. తొలి ఆరు మాసాలు బాగానే ఉన్నా.. తర్వాత మాత్రం జోరు పెం చారని అంటున్నారు. ప్రతి విషయం తనకు తెలియాలని చెప్పడంతోపాటు.. ఆ విషయంలో ఎవరెవరు ఉన్నారు? ఎలా చేస్తున్నారు? అనే అంశాలపై కూడా ఎమ్మెల్యే కూలంకషంగా ఆరా తీస్తుండడం.. ప్రతి అంశాన్నీ నిశితంగా ప్రశ్నిస్తుండడం వంటివి నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు.. ఎవరైనా.. ఇల్లు కట్టుకున్నాకూడా.. దానికి ప్లాన్ ఇచ్చే విషయంలో ను.. ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటున్నారని.. ఇక్కడ అధికారులే చెబుతుండడం గమనార్హం. అంతేకాదు.. వ్యవసాయ బోర్లు వేసుకోవాలన్నా.. చిన్నపాటి ఇల్లు నిర్మించుకోవాలన్నా.. ఆయన కనుసన్నల్లోనే అను మతులు ఇవ్వాల్సి వస్తోందని.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులవైతే.. అనుమతులు ఇచ్చేందుకు నెలల తరబడి వెయిట్ చేయిస్తున్నారని.. అదే తమ పార్టీ వారివైతే.. రాత్రికి రాత్రి అనుమతులు ఇచ్చేస్తు న్నారని.. ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని.. కానీ.. ఇప్పుడు మాత్రం.. దీనికి భిన్నంగా మారిపోయిందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ.. ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యే పై కింది స్థాయి నుంచి విమర్శలు.. కూడా వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు.. సైతం వణికి పోతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.