Begin typing your search above and press return to search.
వివాదంలో వైఎస్సార్సీపీ ఎంఎల్ఏ జక్కంపూడి రాజా!
By: Tupaki Desk | 2 Jun 2022 5:15 AM GMTతూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివాదంలో ఇరుక్కున్నారు. తనపై దౌర్జన్యం చేసిన రాజా మూడుసార్లు చెంప మీద కొట్టారని.. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ (ఏఈఈ) సూర్యకిరణ్.. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
బాధితుడు సూర్యకిరణ్ తెలిపిన వివరాల మేరకు... పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబంధించిన పుష్కర కాలువ రంగంపేట పరిధిలో ఉంది. దాని పూడికతీత, అభివృద్ధి పనులు చేయాలని ఆయకట్టు రైతులు కోరగా.. నిధులు మంజూరు కాలేదని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. తామే ఆ పనులు చేపడతామని, నిధులు మంజూరయ్యాక ఇవ్వాలని రైతులు వారిని ఒప్పించి పనులు చేశారు. రెండేళ్లయినా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ఏడాదిగా ఎమ్మెల్యే అధికారులను అడుగుతున్నారు.
తాజాగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఈ విషయం గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కార్యనిర్వాహక ఇంజనీరు సూర్యకిరణ్‌ను ప్రశ్నించారు. సూర్య కిరణ్ వివరణ ఇస్తుండగానే.. రాజా ఆగ్రహంతో తనను మూడుసార్లు చెంపపై కొట్టారని తెలిపారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా.. వారు కనీసం ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించలేదని సూర్యకిరణ్ చెబుతున్నారు. దీంతో ఏఈల అసోసియేషన్ సభ్యులతో కలిసి రాజాపై ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి నేపథ్యంలో.. జూన్ 2న భోజన విరామ సమయంలో ధవళేశ్వరం జలవనరుల శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఏఈల అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధుబాబు చెప్పడం గమనార్హం.
కాగా గతంలోనూ ఎంఎల్ఏ రాజా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2017లో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం జాలిమూడి వద్ద ఇసుక లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రాజా ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై ఆయన చేయి చేసుకున్నారు. అదేవిధంగా 8 నెలల కిందట సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల గణిత అధ్యాపకుడు పులుగు దీపక్.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ చేతుల మీదుగా బాడీఫ్రీజర్ ప్రారంభించే కార్యక్రమం నిర్వహించారు.
దీంతో ఎమ్మెల్యే.. దీపక్‌ను ముగ్గళ్ల సచివాలయానికి పిలిపించి మందలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇది జరిగిన కొద్దిరోజులకే రాజా వర్గీయులు దాడి చేసి తన కారును ధ్వంసం చేశారని దీపక్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు 14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కాగా జక్కంపూడి రాజా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. గతంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పలుమార్లు వీరిద్దరూ బహిరంగంగా గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు.