Begin typing your search above and press return to search.
50కోట్లు - మంత్రిపదవి..వైసీపీ ఎమ్మెల్యేకు బాబు ఆఫర్.?
By: Tupaki Desk | 21 Oct 2018 6:48 AM GMTతన పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున చెల్లించి ఏపీ సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అప్పట్లో చాలాసార్లు ఆరోపించారు. ఇప్పటివరకూ గడిచిన నాలుగేళ్లలో వైసీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. వీరిని కొనుగోలు చేయడంలో చంద్రబాబు దాదాపు 500 కోట్ల వెచ్చించాడని మండిపడ్డారు. ఇప్పుడా ఆరోపణలకు బలం చేకూర్చేలా.. చంద్రబాబు బండారం బయటపడేలా ఓ వైసీపీ ఎమ్మెల్యే సంచలన విషయాలు బయటపడ్డాడు.
తాజాగా శనివారం కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే జీ. జయరాం ఏపీ సీఎం చంద్రబాబుపై బాంబు పేల్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరితే రూ.50 కోట్లు ఇస్తానన్నాడని.. అంతేకాదు.. మినిస్టర్ పదవి కూడా ఆఫర్ చేసినట్టు సంచలన విషయాలు వెల్లడించారు. తాను డబ్బు కోసం అమ్ముడుపోయే మనిషిని కాదని.. జగన్ - వైసీపీ విశ్వాసాలకు పార్టీ మారనని స్పష్టం చేశారు. తనతోపాటు గెలిచిన సహచరులు భూమా నాగి రెడ్డి - ఎస్వీ మోహన్ రెడ్డి లు టీడీపీ అధ్యక్షుడు ఎరగా వాడుకున్నారని.... టీడీపీకి వారు అమ్ముడుపోయారని వైసీపీ ఎమ్మెల్యే జీ జయరాం ఆరోపించారు.
చంద్రబాబు ప్రతిపాదనను ఒప్పుకోకపోవడంతో తనపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జీ జయరాం ఆరోపించారు. అప్పటి నుంచి తనను వేటాడుతూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి కూడా నిధులను విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లలోనే వైసీపీ ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు వెచ్చించాడని.. ఇప్పుడు అధికార బలంతో రూ.1000 కోట్లను చెల్లించి కొనేందుకు ముందుకు వస్తున్నాడని జయరాం ఆరోపించారు.