Begin typing your search above and press return to search.
జ్యోతుల చంటిబాబు : ఈ రోజు వైసీపీ...రేపు జంపేనా...?
By: Tupaki Desk | 4 Aug 2022 3:50 AM GMTఉన్నది ఉన్నట్లు చెబితే రాజకీయ నాయకుడు కాదు అని అంటారు. అయితే వర్తమాన రాజకీయం అందునా సోషల్ మీడియా యుగంలో అన్నీ బట్ట బయలు అవుతున్నాయి. దాంతో చెప్పకతప్పని పరిస్థితి కొన్ని సార్లు ఉంటోంది. ఇక ఏ చిన్న విషయం జరిగినా అది బయటకు ఇట్టే వచ్చేస్తోంది. ఇంకో వైపు సర్వేలు కూడా యమ జోరుగా సాగుతున్నాయి. దాంతో నేతలకు ఉక్క బోతగా ఉంటోంది. అధికారంలో ఉన్న వారైతే వారి హైరానా మామూలుగా లేదు.
బహుశా ఇవన్నీ కూడా తెగ ఒత్తిడి పెంచేసి గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల చంటిబాబు అనే ఒక వైసీపీ ఎమ్మెల్యే నోటి వెంట నిజాలు గటగటా వల్లించేలా చేశాయనుకోవాలి. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే. 2019 ఎన్నికల్లో మంచి ఊపులో జగన్ వేవ్ లో ఎమ్మెల్యే అయిపోయారు. ఇపుడు సీన్ చూస్తే బాగా మారింది.
పైగా అక్కడ జనసేన జెండా బాగా ఎగురుతోంది. ఈ నేపధ్యంలో జ్యోతుల తాజాగా చేసిన కామెంట్స్ వైసీపీలో చాలా మంది గొంతుగా చెప్పుకుంటున్నారు. ఆయన ఏమన్నారూ అంటే పార్టీలే శాశ్వతం కాదు అని. అంటే నాయకుడు శాశ్వతం అన్న మాటని ఆయన చెబుతున్నారు. నాయకుడికి నో పార్టీస్. ఏది గెలిస్తే అదే మన పార్టీ అన్నదే నయా ఫిలాసఫీ. దాన్ని ఎలాంటి బాధా ఇబ్బంది పడకుండా చంటిబాబు చాలా బోల్డ్ గా చెప్పేశారు.
పక్క పార్టీ వారితో గొడవలు పడమాకండి. ఎందుకంటే రేపు అదే మన పార్టీ కావచ్చేమో అంటూ సెటైరికల్ గా జ్యోతుల చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. ఆయన చూపు జనసేన మీద ఉందని అంటున్నారు. జనసేనకు ఈయన గట్టి క్యాండిడేట్ అవుతారు అనుకుంటే తీసుకుంటారు. దానికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే జంపింగ్ ఈజీగా ఉంటుందని ముందు చూపుతో ఈ రాజకీయ చంటబ్బాయి అనాల్సిన నాలుగు మాటలూ జనాల ముందే అనేశారు.
మరి ఇక వైసీపీతో ఆయన బంధాలు అన్నీ కూడా రెండేళ్ళ అధికార బంధాలే అన్న మాట. జగన్ జాబితాలో సీటు చిరిగిపోయే వారిలో జ్యోతుల కూడా ముందు వరసలో ఉంటారని కూడా అంటున్నారు. చూడాలి మరెంతమంది చంటిబాబులు వైసీపీలో గొంతు పెంచుతారో.