Begin typing your search above and press return to search.

బాబు మీద ఎగిరిపడే కొడాలి... ఫుల్లుగా కెలికినా...?

By:  Tupaki Desk   |   21 April 2022 1:09 PM GMT
బాబు మీద ఎగిరిపడే కొడాలి... ఫుల్లుగా కెలికినా...?
X
ఆయన మీడియా ముందుకు వస్తే చాలు చూసే టీవీలు దద్దరిల్లేలా బిగ్ సౌండ్ చేస్తారు. ఆయన మాటల ప్రవాహానికి అవతల వారు తట్టుకోలేరంతే. ఆయనే గుడివాడకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన గత పది రోజులుగా ఫుల్ సైలెంట్ గా ఉంటున్నారు. మౌనమే నా భాష అని కూడా చెప్పేస్తున్నారు. ఒకనాడు జగన్ మీద చంద్రబాబు విమర్శలు చేస్తే అంత ఎత్తున ఎగిరిపడిన కొడాలి ఫుల్ కామ్ అయిపోయారు.

బహుశా మంత్రి పదవి పోయిన తరువాత ఆయనలో ఈ మార్పు వచ్చిందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు వేళ చంద్రబాబు క్రిష్ణా తీరాన రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణులతో జనాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ని టార్గెట్ చేసి హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

పనిలో పనిగా మాజీ మంత్రి కొడాలి నానిని కూడా కెలికారు. క్రిష్ణా జిల్లాలో ఒక బూతుల మంత్రి ఉండేవారు. ఆయనను మన మీదకు ఎగదోసి జగన్ రాజకీయ వినోదం చిత్తగించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు నా జీవితంలో ఎపుడూ చూడలేదు అంటూ బాబు గట్టిగా ఫైర్ అయ్యారు.

నాడు నా మీద ఎన్నో రకాలైన మాటలు అన్నారు అంటూ అనుచిత కామెంట్స్ చేసిన బూతుల మంత్రికి ఇపుడు పదవి కూడా పోయిందంటూ బాబు ఎద్దేవా చేశారు. మొత్తానికి అటు జగన్ని ఇటు కొడాలి నానిని కలిపి చంద్రబాబు మాటలతో చెడుగుడు ఆడుకున్నారు. ఇంత జరిగినా కూడా కొడాలి నుంచి నో కామెంట్. నిజంగా ఆశ్చర్యమే అంటున్నారు అంతా.

మేము జగన్ గ్యారేజీ మనుషులం, మాకు మంత్రి పదవులతో సంబంధం లేదు, మేము జగన్ ఏం చెబితే అది చేస్తామని చెప్పిన కొడాలి నాని చంద్రబాబు జగన్ని తననూ కలిపి హాట్ కామెంట్స్ చేసినా రియాక్ట్ అవలేదు అంటేనే వైసీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. నిజంగా నాని ఎందుకు రియాక్ట్ కాలేదు అన్న చర్చ సాగుతోంది.

దీనికి ముందు అయితే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అయితే నిజామాబాద్ సభలో జగన్ని ఏకవచనంతో సంభోధించారు. పెను సవాల్ చేశారు. అనుచితమైన కామెంట్స్ చేశారు. అపుడే కొడాలి నాని వచ్చి దానికి రెండింతలు ధీటుగా రియాక్ట్ అవుతారు అని అనుకున్నారు. అదీ జరగలేదు. మొత్తానికి చంద్రబాబు జగన్ని ఏమన్నా సహించేది లేదు అంటూ చెప్పిన నాని కామ్ గా ఉండడం మాత్రం విడ్డూరమే అంటున్నారు.

అయితే నాని మంత్రిగా ఓవర్ గా వెళ్లారని, అందుకే ఇపుడు మాజీ మంత్రిగా తన గుడివాడ నియోజకవర్గంతోనే తాను ఉండాలని అనుకుంటున్నారు అని సన్నిహితులు అంటున్నారు. అంతే కాదు, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను జగన్ అప్పగించారు కానీ నాని దాన్ని చేపడతారా అన్న డౌట్లు కూడా పుట్టుకువస్తున్నాయి.

మొత్తానికి చూస్తే నానిలోనూ తమ సామాజికవర్గానికి మంత్రి పదవి ఒక్కటి కూడా ఇవ్వలేదన్న బాధ ఉందని అంటున్నారు. అందుకే టీడీపీకి బాబుకు ఎదురెళ్లలేక మౌనంగా ఉంటున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా కొడాలి నాని మళ్ళీ కేక పెట్టాలని వైసీపీలో అంతా కోరుకుంటున్నారు.

ఆయన బిగ్ సౌండ్ చేస్తేనే ఏపీ రాజకీయాల్లో కాక పుడుతుంది. వైసీపీలో జోష్ వస్తుంది, ఇది మెజారిటీ క్యాడర్ అంగీకరించే విషయం. కొడాలి నాని సైలెంట్ అయితే వైసీపీ టోటల్ గా డల్ అయినట్లుగా ఉందని కూడా అంటున్నారు. మరి తొందరలో నాని రీ చార్జి అయి బాబు మీద దూకుడు చేస్తారని అంతా ఆశిస్తున్నారు. అది జరిగేనా అంటే వెయిట్ అండ్ సీ.