Begin typing your search above and press return to search.
మంత్రి పదవి వెంట్రుకతో సమానమా? ఇదెక్కడి దరిద్రం కొడాలి
By: Tupaki Desk | 24 April 2022 7:30 AM GMTకీలక స్థానాల్లో ఉన్న వారు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలి. కానీ.. అందుకు భిన్నంగా నోటికి పని పెట్టటం ఈ మధ్యన అలవాటుగా మారింది. వెనుకా ముందు లేకుండా మాట్లాడే మాటలతో ప్రజల్లో చులకన అవుతున్నామన్నవిషయాన్ని సదరు నేతలు గుర్తించటం లేదు.
ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించటం.. ఇందులో భాగంగా పలువురు నేతల్ని పక్కన పెట్టటం తెలిసిందే. అలా పెట్టిన వారిలో జగన్ కు ఎప్పుడూ దన్నుగా నిలుస్తూ.. ఆయనకు వీర విధేయుడిగా పేరున్న కొడాలినాని పేరు మంత్రవర్గంలో లేకపోవటాన్ని ఆయన మాత్రమే కాదు.. ఆయన అనుచరులు సైతం అవాక్కు అయిన పరిస్థితి.
తన నోటి దూలతోనే మంత్రి పదవిని చేజార్చుకున్నారంటూ కొడాలి నాని ప్రత్యర్థులు వ్యాఖ్యలకు తీసిపోని రీతిలో ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. మంత్రి పదవి పోయిన నాటి నుంచి ఆయన దూకుడు తగ్గిందన్న మాట వినిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. తాజాగా కొడాలి క్రిష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొడాలి నాని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను మాజీ మంత్రి పిలవొద్దని సున్నితంగా తిరస్కరించటం గమనార్హం.
మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం మంత్రిగా ఉన్నప్పుడు రాని మాటలు.. పదవి పోగానే రావటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. మాజీ మంత్రి అనిపించుకోవటానికి కంటే ముందు తాను ఎమ్మెల్యేగా అనిపించుకోవటానికే ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి వెంట్రుకతో సమానమైనప్పుడు జగన్ వెళ్లిపొమ్మని చెప్పే వరకు ఉండటం దేనికి? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెబితే బాగుంటుంది కదా? మరి.. దీనికి కొడాలి నాని ఏమని బదులిస్తారో?