Begin typing your search above and press return to search.
కొడాలి రీ ఎంట్రీ : ఆయన సౌండ్ అవసరం ఇపుడు...?
By: Tupaki Desk | 9 May 2022 3:29 PM GMTవైసీపీలో మంత్రి వర్గ విస్తరణ తరువాత జోష్ అయితే తగ్గిపోయింది అంటున్నారు. ఏపీలో పాలిటిక్స్ అంతా వన్ సైడెడ్ గానే అన్నట్లుగా కధ నడుస్తోంది. ఒక విధంగా విపక్షానికి కూడా ఇది చప్పచప్పగా ఉందిట. వారు ఒకటి అంటే రెండు అనేలా అవతల వైపు అధికార పక్షం నుంచి సౌండ్ వినిపిస్తే కదా సీన్ రక్తి కట్టేది. పైగా మీడియాలో కూడా హాట్ హాట్ కామెంట్స్ బాగా తగ్గిపోతున్నాయి.
నిజంగా ఆ లోటు ఎవరు ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ వైసీపీ అధినాయకత్వానికి మాత్రం బాగా అర్ధమైంది అనే అంటున్నారు. అందుకే అర్జంటుగా కొడాలి నానికి సీఎం జగన్ స్వయంగా పిలిపించుకుని మరీ మంతనాలు జరిపారు. వన్ టూ వన్ చర్చలుగా సాగిన ఈ మీటింగులో సారాంశం ఏమిటి అన్నది బయటకు తెలియకపోయినా కొడాలి నాని అవసరం అయితే ఈ టైమ్ లో పార్టీలో ఉంది అంటున్నారు.
జగన్ తొలి విడత మంత్రివర్గంలో ఒక కొడాలి నాని, ఒక పేర్ని నాని, ఒక వెల్లంపల్లి ఈ ముగ్గురూ క్రిష్ణా జిల్లా నుంచి రోజూ మీడియాలో తెగ హోరు హుషార్ చేసేవారు. ఇపుడు మలివిడత విస్తరణలో చూస్తే అంబటి రాంబాబు, ఆర్కే రోజా వంటి వారున్నా ఎందుకో సౌండ్ మాత్రం పెద్దగా బయటకు వినిపించడంలేదు. అటు గుడివాడ అమరనాధ్ వంటి వారు హడావుడి చేస్తున్నా టోటల్ గా ఏపీ మీడియాను ఫోకస్ చేయలేకపోతున్నారు.
దాంతో ఒక నెల గ్యాప్ లోనే అధికార వైసీపీకి మీడియాలో పొలిటికల్ స్పేస్ బాగా తగ్గిపోయింది. ఇక కౌంటర్లు ఇచ్చేవారు, సెటైర్లు వేసేవారు, పంచులు పేల్చేవారూ కూడా లేకుండా పోయారు. దాంతో విస్తరణ వంటి బృహత్తర కార్యక్రమం జరిగిన తరువాత వైసీపీ మూడేళ్ళకే ఇలా డీలా పడిపోయిందా అన్న చర్చ అయితే వస్తోంది.
దాంతోనే కొడాలి నానిని జగన్ పిలిపించుకున్నారు అంటున్నారు. మాజీ అయిన తరువాత కొడాలి ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక ఆయనను క్రిష్ణా గుంటూరు జిల్లాలకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించినా కూడా పెద్దగా చురుకుదనం లేదనే అంటున్నారు. అలాగే ఆయన కోసం క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఇద్దామనుకుంటే కూడా నో చెప్పేశారు.
దాంతోనే జగన్ ఇపుడు ఆయనను పిలిచి ఉంటారని అంటున్నారు. మరి కొడాలి రేపటి నుంచి మీడియాలో సౌండ్ చేస్తే మాత్రం ఈ భేటీ విషయం ఏంటో అర్ధమవుతుంది. లేక యధాప్రకారం ఆయన సైలెంట్ గా ఉంటే ఈ సమావేశం సాధారణంగానే మిగిలిపోతుంది. ఏది ఏమైనా వైసీపీకి కొడాలి జోష మిస్ అవుతోంది. అలాగే అటు చంద్రబాబు అయినా ఇటు పవన్ అయినా డబుల్ ఇంజన్ మాదిరిగా దూసుకువచ్చి కౌంటర్లేసే కొడాలి నాని వంటి వారు ఇపుడు వైసీపీకి లేకపోవడంతోనే అధినాయకత్వం అలెర్ట్ అయింది అంటున్నారు.