Begin typing your search above and press return to search.
కొడాలి మార్క్ పంచ్ : రాజకీయాల్లోకి సన్నాసులు...?
By: Tupaki Desk | 26 May 2022 4:30 PM GMTసన్యాసీ అంటే సర్వం పరిత్యజించిన వాడు అని అర్ధం. మరి సన్నాసీ అంటే ఏముంది ఏమీ తెలియని వాడు అనేనా అనుకోవాలి. లేదా అన్నీ తెలుసని మిడిసిపడేవాడు అని అయినా భావించాలి. ఇవన్నీ పక్కన పెడితే చాలా రోజుల తరువాత మాజీ మంత్రి కొడాలి నాని సౌండ్ చేశారు. ఆయన ఇండైరెక్ట్ గానూ డైరెక్ట్ గానూ చాలా విషయాలు జనసేనాని పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారు, అలాగే కౌంటర్లు వేశారు.
రాజకీయాల్లోకి సన్నాసులు వస్తున్నారు అంటూ పంచ్ డైలాగులే పేల్చారు. నిక్కర్లు కట్టుకునే కుర్రాళ్ళను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుకుంటున్నారు అని నాని విమర్శించారు. రాజ్యాంగం మీద అవగాహన లేని వారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు చదివే వారు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని కూడా ఎద్దేవా చేశారు.
కోనసీమలో జరిగిన అల్లర్లలో నిజంగా పోలీసులు కాల్పులు జరిపి ఉంటే శవాలను మోసేందుకు సొంత పుత్రుడు, అద్దె పుత్రుడు పోటీ పడేవారు అని కొడాలి పవర్ ఫుల్ పంచులే పేల్చారు. అయితే ప్రభుత్వం మాత్రం సహనంతో వ్యవహరించిందని, శవ రాజకీయాలకు తావు లేకుండా చూసిందని అన్నారు.
అసలు ప్రభుత్వాన్ని ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వాళ్లను, అంబేద్కర్ అంటే ఇష్టం లేదని బాహాటంగా వ్యతిరేకించే వారిని దేశ బహిష్కరణ చేసి జైలుకు పంపాలని నాని డిమాండ్ చేశారు.
చీకటి ఒప్పందాలను చేసుకునే నాయకుల నుంచి తమ పిల్లలను తల్లితండ్రులే రక్షించుకోవాలని కొడాలి నాని కోరారు. మరి ఆ ఒప్పందాలు ఎవరు చేసుకున్నారు. ఆ నాయకులు ఎవరూ అన్నది ఆయన చెప్పలేదు. కానీ ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి తెలుస్తాయని కాబోలు అలా వదిలేశారు. మొత్తానికి చాలా కాలానికి వచ్చినా కూడా నాని తనదైన కొడవలి మార్క్ పంచులతో పవన్ మీద విరుచుకుపడ్డారనే చెప్పాలి. మరి దీనికి జనసేన నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.