Begin typing your search above and press return to search.
జగన్ కు ఇంకో షాకిస్తున్న మైనార్టీ నేత
By: Tupaki Desk | 25 Jun 2016 8:06 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే 20 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేయటం తలిసిందే. అయినా.. మరికొందరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు మక్కువ చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది. శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆ మధ్యన జగన్ పార్టీ నుంచి జంప్ అయి వచ్చిన మైనార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ హాజరయ్యారు. నిజానికి ఇదేమీ పెద్ద వార్త కూడా కాదు.కానీ.. ఇక్కడే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు అధికారపక్ష ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హాజరయ్యారు ఇంతమంది నేతలు ఉన్నా.. ఒకరు మాత్రం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించారు. అంతలా ఆకర్షించిన ఎమ్మెల్యే ఎవరంటే.. జగన్ పార్టీకి చెందిన గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా హాజరయ్యారు.
స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఈ కార్యక్రమానికి హాజరైనట్లుగా చెబుతున్నప్పటికీ ముస్తఫా తీరు పలు సందేహాలు కలిగేలా ఉండట గమనార్హం. విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రికి ఎంత దూరంగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా చంద్రబాబు పక్కన కూర్చోవటంతో పాటు.. ఆయనతో ముచ్చట్లు చెబుతున్న దృశ్యాలు అందరిని విపరీతంగా ఆకర్షించాయి. ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమాల్లో విపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం కష్టం. అందుకు భిన్నంగా ముస్తఫా మాట్లాడేందుకు బాబు అవకాశం ఇవ్వటం చూస్తే.. ఆయన సైకిల్ ఎక్కే కాలం దగ్గర్లోనే ఉందని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ బాబుకు మరో దెబ్బ పడినట్లే.