Begin typing your search above and press return to search.
ఓట్లు వేయరనే నోట్లు గుమ్మరిస్తున్న బాబుః వైసీపీ
By: Tupaki Desk | 31 July 2017 5:10 PM GMTఅబద్దాల హామీలతో అధికారం చేపట్టి ప్రజలను మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తులు వేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అందుకే ఉప ఎన్నికలో చంద్రబాబు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నివాసంలోని మీడియా కేంద్రంలో రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడున్నర సంవత్సరాల కాలంలో రూ. 5 నుంచి 6 లక్షల కోట్ల దాకా చంద్రబాబు ఖాతాలో జమ వేసుకున్నారన్నారు.
నిరుద్యోగులకు, మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు 50 శాతం కూడా నెరవేర్చకుండా కష్టాలకు గురి చేశారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. రైతుల రుణ మాఫీ రూ. 85 వేల కోట్లకు గాను రూ. 16 వేల కోట్లు మాత్రమే జరిగిందని, డ్వాక్రా మహిళలకు రూ. 16 వేల కోట్లకు రూ. 5 వేల కోట్లు మాత్రమే పరిష్కారం జరిగిందని అన్నారు. ఇలా ప్రజా వ్యతిరేక పాలన సాగించినందుకు ఓట్లు వేయరని భావించిన చంద్రబాబు నోట్లు గుమ్మరిస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా మీడియాతో మాట్లాడుతూ నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ముస్లింలపై చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలిచేందుకు లేని ప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ముస్లింలకు ఓట్లు వేయలేదని అందుకే మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని ముస్తాఫా ఆరోపించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు చంద్రబాబు పదవులు ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారని, ఆ తరువాత ఎలాంటి పదవులు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించారని ముస్తఫా నిప్పులు చెరిగారు. మైనారిటీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. నంద్యాల పట్టణంలో ఇవాళ ఒకరి వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి, మరోకరికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ కౌన్సిలర్ నిన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన్ను అర్ధరాత్రి టీడీపీ నేతలు ఏవిధంగా తీసుకెళ్లారో ప్రజలు గమనించారని ముస్తఫా అన్నారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముస్లింలు ఓట్లు వేయరనే భయంతోనే అబద్ధపు హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు దక్కాయని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని ముస్తఫా తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టాలని ఆయన కోరారు.