Begin typing your search above and press return to search.
సిల్లీగా: రాజీనామా చేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే ఓవరాక్షన్!
By: Tupaki Desk | 19 July 2019 10:55 AM GMTఫిరాయింపు రాజకీయాలకు పాల్పడినందుకు చంద్రబాబుకు ప్రజలే తగిన శిక్ష వేశారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ కూడా సభ సాక్షిగా చెప్పారు. దేవుడు చంద్రబాబుకు అద్భుతమైన స్క్రిప్ట్ రాశారని, ఫిరాయింపు రాజకీయాలు అనే అనైతిక చర్యకు పాల్పడినందుకు తగిన శిక్ష విధించాడని జగన్ ఇది వరకే అన్నారు.
23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుక్కొన్నందుకు చంద్రబాబు నాయుడుకు ప్రజలు, దేవుడు సరిగ్గా అంతే మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇటీవలి ఎన్నికల్లో ఇచ్చి అద్బుతమైన స్క్రిప్ట్ ను అమలు చేశారని జగన్ అన్నారు. ఆ విషయాన్ని గమనించిన వాళ్లంతా చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని కూడా అనుకున్నారు.
అదంతా గతం. జరిగినది జరిగింది. దానికి ప్రజల రియాక్షన్ కూడా ఇచ్చేశారు. తాము ఫిరాయింజు రాజకీయాలను చేసేది లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. అక్కడితో ఖేల్ ఖతం అనుకోవాలి. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాత్రం దానిపై అతిగా స్పందించేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఫిరాయింపులపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ ఫిరాయింపు రాజకీయాలపై చర్చ పెట్టాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు అన్నా రాంబాబు.
అయితే అంతటితో కూడా ఆయన ఆగలేదు! మరింతగా రియాక్ట్ అయిపోయి, ఫిరాయింపు రాజకీయాలపై చర్చ పెట్టకపోతే తను రాజీనామా చేసి వెళ్లిపోనున్నట్టుగా ప్రకటించారు. అసెంబ్లీలో ఆ అంశంపై చర్చించకపోతే తను ఎమ్మెల్యేగా ఉండనంటూ ఆయన ప్రకటించుకున్నారు.
ఇదే మరి అతి అంటే. ఫిరాయింపు రాజకీయాలు ముగిసిన అధ్యాయం. దానిపై ప్రజలే తీర్పును ఇచ్చారు. తాము అలాంటి వాటిని సహించేది లేదని ప్రజలు తేల్చారు. అలాంటప్పుడు దానిపై మరీ ఇంత అతిగా రియాక్ట్ అయిపోవడం విడ్డూరంగా ఉంది. చర్చ జరగాల్సిందే అంటూ అన్నా రాంబాబు రాజీనామా అంటూ డిమాండ్ చేయడం పట్ల వైఎస్ జగన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం.