Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే పై సొంత అన్న తీవ్ర విమర్శలు!
By: Tupaki Desk | 6 Jan 2023 6:26 AM GMTకర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుదాకర్ పై ఆయన సొంత అన్న సుదర్శన్ ధ్వజమెత్తారు. కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్ తన సొంత తమ్ముడిని.. అతడు నమ్మక ద్రోహి అని మండిపడ్డారు. సుధాకర్ తన స్వప్రయోజనాలే తప్ప ఎవరినీ పట్టించుకోరని తీవ్ర విమర్శలు చేశారు. అతణ్ని నమ్మి కోడుమూరు ప్రజలే కాదు.. సొంత కుటుంబ సభ్యులం తాము కూడా మోసపోయామని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సుదర్శన్, టీడీపీ సీనియర్ నేత విష్ణువర్ధన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అన్న సుదర్శన్ తీవ్ర విమర్శలు చేశారు. తన తమ్ముడు ఎమ్మెల్యే సుధాకర్, తాను 30 ఏళ్లు టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి అనుచరులుగా ఉన్నామని తెలిపారు. తన తమ్ముడు ఎంబీబీఎస్ చదివాడని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించి.. తద్వారా 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారని వివరించారు. తన తమ్ముడికి వైసీపీ కోడుమూరు టికెట్ దక్కడంతో తామంతా టీడీపీని విడిచిపెట్టి వైసీపీలో చేరామని తెలిపారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులం అంతా తన తమ్ముడు సుధాకర్ Vð లుపుకు కష్టపడ్డామని వెల్లడించారు.
తన తమ్ముడి గెలుపు కోసం తాను రూ.30 లక్షలు ఖర్చు పెట్టానని సుదర్శన్ తెలిపారు. ఆ డబ్బులు అడుగుతానేమోనని తన తమ్ముడు ఎమ్మెల్యే సుధాకర్ తనను దూరం పెట్టాడని ఆరోపించారు. చివరకు తన ఆఖరి కుమార్తె వివాహానికి సైతం తన తమ్ముడు సుధాకర్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సుధాకర్ వన్నీ తప్పుడు ఆలోచనలేనన విమర్శించారు. ఇంతటి మోసకారిని తన జీవితంలో చూడలేదని తీవ్ర విమర్శలు చేశారు. కోడుమూరులో టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు.
కాగా తాను ఏడాది కిందట పత్తికొండ నియోజకవర్గ టీ డీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు సమక్షంలో టీడీపీలో చేరానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుధాకర్ పై సొంత అన్న సుదర్శన్ విమర్శలు కోడుమూరు నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి. నియోజకవర్గంలో ప్రజలు ఈ విమర్శలపై చర్చించుకుంటున్నారు. కీలకమైన ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేపై సొంత అన్నే తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు తన అన్న సుదర్శన్ తనపై చేసిన విమర్శల విషయంలో ఎమ్మెల్యే సుధాకర్ ఎలా స్పందిస్తారనేది ఆస్తకికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.