Begin typing your search above and press return to search.
పువ్వంటే ఫ్లవరే : వార్ని... పేర్ని నాని ఎంత మాటనేశారో...?
By: Tupaki Desk | 8 Jun 2022 5:30 PM GMTఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా ఫైర్ అని కధానాయకుడు అంటారు. కానీ ఇపుడు వైసీపీ మాజీ మంత్రి మాత్రం పువ్వు అంటే ఫ్లవరే అని కమలం పువ్వు పార్టీ గాలి తీసేస్తున్నారు. అవును పువ్వు పార్టీ ఎగేసుకుని వచ్చి ఏపీలో ఏం చేసిందని కూడా బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. ఇదంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో వైసీపీ మీద నాన్ స్టాప్ గా విమర్శలు చేసిన ఫలితం అన్న మాట.
మమ్మల్నే అంటారా అంటూ పేర్ని నాని మీడియా సాక్షిగా చెలరేగిపోయారు. పువ్వు పార్టీ ఏపీ జనాల చెవిలో పువ్వు పెట్టిందని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి పువ్వు పార్టీ ఏం చేసిందో చెప్పాలని స్ట్రైట్ గానే నిగ్గదీశారు. ఏపీ జనాలకు నిఖార్సుగా ఇది మంచి చేశామని చెప్పుకోలేని బీజేపీ వాళ్ళు వైసీపీ మీద విమర్శలు చేయడం విడ్డూరం అని కూడా నాని అనేశారు.
గోదావరి ఒడ్డున నిలబడి మాట్లాడిన నడ్డా పోలవరం గురించి ఒక్క మాట అయినా తలచుకున్నారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరాన్ని కట్టించాల్సిన కేంద్రం చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేయడమేనా ఏపీకి చేసిన మేలు అని ఆయన మండిపడ్డారు.
ఏపీలో వైసీపీ విపక్షాల గొంతు నొక్కుతోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్న నడ్డా కేంద్రంలోని తమ ప్రభుత్వ నిర్వాకమే అదని తెలుసుకోవాలని చురకలు అంటించారు. ఎంఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ ఆదాయపు పన్ను శాఖలతో దాడులు చేయిస్తూ ఎంతోమంది ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసింది ఎవరో చెప్పగలరా నడ్డా సార్ అని పేర్ని పంచులే పేల్చారు.
ఏడాదికి రాష్ట్రలో ఆరోగ్యశ్రీకి 2,400 కోట్ల దాకా వైసీపీ సర్కార్ ఖర్చు చేస్తోందని, మరి ఆయుష్మాన్ భారత్ ద్వారా అయిదు లక్షల వంతున ఇస్తున్నామని నడ్డా చెప్పడం కంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అని నాని అడిగేశారు,కడిగేశారు.
ఏమీ తెలియకుండా ఎకాఎకిన ఏపీకి వచ్చి అబద్ధాలు చెప్పకపోతే వచ్చే మందు కేంద్ర మంత్రులను కలసి ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారో ఎంత అప్పు ఉందో తెలుసుకుని వస్తే బాగుంటుంది కదా అని మరో చురక అంటించారు. కేంద్రం అప్పు ఏకంగా 53 లక్షల కోట్ల నుంచి 130 లక్షల కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
ఇక ఏపీ మితిమీరి అప్పులు చేస్తున్నారు అని ఆరోపిస్తున్న నడ్డా కేంద్రం ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుని కూర్చోందా. ఇక మీ క మంత్రి, ఆర్ధిక వ్యవస్థలు ఏం చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అన్న దాని మీద అవగాహన ఉందా అని నాని ఘాటుగా గట్టిగా నిగ్గదీస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ నుంచి ఎగేసుకుని ఏపీ జనాల చెవులలో పువ్వులు పెడదామంటే కుదిరే సీన్ ఇక్కడ లేదు నడ్డా సార్ అంటూ పేర్ని ఇవ్వాల్సింది ఇచ్చేశారు. పేని నాని మీడియా మీట్ చూసిన వారు అంతా ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మా పేర్ని నానిలో ఫైర్ ఇలా అని విస్తుబోతున్నారు. వార్ని పేర్నీ అని కూడా అంటున్నారు.