Begin typing your search above and press return to search.

2024లో కుమ్ముడే కుమ్ముడు అట‌! నిజ‌మేనా !

By:  Tupaki Desk   |   11 July 2022 2:30 AM GMT
2024లో కుమ్ముడే కుమ్ముడు అట‌!  నిజ‌మేనా !
X
మాజీ మంత్రి పేర్నినాని ప్లీనరీలో మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విప‌క్షాల‌కు కుమ్ముడే కుమ్ముడు అని డైలాగులు పేల్చారు. నిజంగానే ఆ విధంగా సాధ్యం అవుతుందా? అస‌లు ఇంత‌వ‌ర‌కూ ఏ ముఖ్య‌మంత్రీ చేయ‌ని విధంగా ఆయ‌న పాల‌న చేస్తున్నారు అనేందుకు ఏమ‌యినా ఉదాహ‌ర‌ణ‌లున్నాయా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా విప‌క్షం నుంచి వినిపిస్తున్న‌వి. అయినా కూడా దుష్ట చ‌తుష్ట‌యం అని ప‌దే ప‌దే తిట్ట‌డంతో ప్లీన‌రీ స‌మ‌యం వెచ్చించ‌డంలో ఏమ‌యినా అర్థం ఉందా ? ఇందుకోసం ప్లీన‌రీ అయితే అందుకు ఓ ప్రెస్మీట్ చాలు ప్లీన‌రీ ఎందుకు ? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు విప‌క్ష స‌భ్యులు.

ఇక అస్స‌లు పాస్ మార్కులు వ‌స్తే చాలు అని సొంత పార్టీ మ‌నుషులే కొంద‌రు అంటున్న వైనం ఉంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓ 70 సీట్లు వ‌స్తాయ‌ని మిగిలిన‌వి టీడీపీ ఖాతాలో చేరుతాయ‌ని కూడా కొంద‌రు అంటున్నారు. పోనీ ఆ విధంగా వ‌చ్చినా రాకున్నా క‌నీస స్థాయిలో అయినా టీడీపీ త‌న ప‌ట్టు నిలుపుకుని మంచి స్థానాన్నే నిల‌బెట్టుకునే విధంగానే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తుంది. అలాంట‌ప్పుడు సింహం సింగిల్ గా వ‌స్తే 175 కు 175 సీట్లూ ఎలా వ‌స్తాయి. అంటే అంత బాగా ఇన్నాళ్లూ మీరు పాల‌న చేశార‌ని మేం అనుకోవాలా ? లేదా ధ‌ర‌ల విష‌య‌మై ఏ పాటి శ్ర‌ద్ధ తీసుకోకుండా త‌ప్పంతా కేంద్రానిదే అని నెడుతున్న మిమ్మ‌ల్ని ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకుంటున్నార‌ని భావించాలా ? అlని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎలా చూసుకున్నా అప్పులు చేసి మ‌రీ సేక‌రించిన డ‌బ్బుల‌న్నీ ఉన్న మేర‌కు సంక్షేమానికి వెచ్చించడం కూడా త‌ప్పు అన్నది ఓ వ‌ర్గం వాద‌న. మధ్యతరగతి ఇది చూసి కుళ్లు కుంటోంది అని చెప్ప‌డం కూడా త‌ప్పు. అభివృద్థికి క‌నీస స్థాయిలో నిధుల‌ను ఇవ్వ‌కుండా కాలం వెచ్చిస్తూ రాజ‌కీయం చేయ‌డం ఇంకా త‌ప్పు కాంటా అంటున్నారు జనం. ఇవి ప‌రిష్క‌రించ‌కుండా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌కుండే డ‌బ్బులు పంచ‌డం కూడా సంక్షేమ‌మే అని చెప్ప‌డం అస్స‌లు స‌బ‌బు కాదు అని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఓ ఊరికి రోడ్డు వేస్తే ఆటోమేటిక్ గా కొన్ని జీవితాలు బాగుప‌డ్తాయి. కానీ అస‌లు రోడ్లే లేకుండా డ‌బ్బులు పంచి జీవ‌న ప్ర‌మాణాలు పెరిగిపోయాయి అని చెప్ప‌డం స‌హేతుకం కాదు అన్న వాద‌న కూడా వినిపిస్తోంది.