Begin typing your search above and press return to search.
కరోనా 'ఫ్రీ' గా నగరి..నియోజకవర్గంలోనే ఉంటూ పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే రోజా!
By: Tupaki Desk | 1 April 2020 7:30 AM GMTనగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా మరోసారి తన మంచి మనసుని చాటుకుంటున్నారు. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ వైసీపీ మహిళా నేత, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ - పార్టీ పై - అధినేత పై విమర్శలు చేసేవారికి వెంటనే రివర్స్ కౌంటర్ ఇస్తూ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కారణంతోనే నగరి నుండి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇకపోతే ప్రస్తుతం దేశాన్ని అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ .. ఏపీని కూడా భయంతో వణికిపోయేలా చేస్తుంది.
ఈ కరోనాకి సరైన మందు లేకపోవడంతో ..దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనాని అరికట్టడానికి ఇదొక్కటే సరైన మార్గం అని భావించి ..లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్ డౌన్ మంచిదే అయినప్పటికీ ..కూడా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి వచ్చిన వారికీ , అలాగే రాష్ట్రంలోని రోజు వారి కూలీలకు అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కొంతమంది తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా ..నగరి నియోజకవర్గంలో ఉన్న వలస కూలీలకు , తినడానికి తిండి కూడా లేనివారికి ...వారు తినడానికి మంచి భోజనం, తాగడానికి నీళ్లు అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వలస కూలీలు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులకు పుత్తూరు లో బస చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారికి పనులు లేకపోవడం - వేతనాలు రాకపోవడం గుర్తించిన ఎమ్మెల్యే రోజా గారు వారిని సంప్రదించి బియ్యము - పప్పు కూరగాయలు అందజేసారు అలాగే , వారిని వారి స్వస్ధలానికి పంపడానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే, నగరి ఏరియా హాస్పిటల్ నందు శానిటేషన్ సిబ్బందికి ఒక్కొక్కరికి 5కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేసారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శానిటేషన్ సిబ్బంది యొక్క సేవలు అమూల్యమైనవని - వారి సేవలను గుర్తించి వారి కుటుంబానికి బియ్యం అందించడానికి ముందుకు వచ్చిన SM తంగమాళిగై యజమాని దిలీప్ కుమార్ ను ప్రశంసించారు.
ఇకపోతే రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రోజా గారు నగరి పురవీధులలో గల అన్ని దుకాణాలను మరియు కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. డిమాండ్ ఉంది కదా అని అధిక ధరలకు అమ్మ రాదని - ధరలు పట్టిక పెట్టాలని - నిర్ణయించిన ధరలకే కూరగాయలు అమ్మాలని - ఆలా కాకుండా ఎక్కువ ధరలకు అమ్మితే ..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్క వ్యాపారస్ధుడు కూడా విధిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించారు. అదే సమయంలో ఉచితంగా మాస్కులును పంపిణీ చేసి ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు
అలాగే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రాణాలని సైతం పనంగా పెట్టి నగరిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 మంది పోలీసులకి - వైద్య సిబ్బందికి రోజు మధ్యాహ్నం - రాత్రి ..మామిడి మునక్కాయ - వంకాయ - సాంబార్ మటిక్కాయ ఫ్రై - అన్నం - తాగడానికి మంచి నీరు అందిస్తున్నారు. మొత్తంగా నగరి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్కే రోజా గారు ..నగరి నియోజకవర్గాన్ని కరోనా ఫ్రీ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి ..ప్రతి రోజు నియోజక వర్గంలో పర్యటిస్తూ - అందరికి కరోనా పై అవగాహనా కల్పిస్తూ - పేదలకి - వైద్య సిబ్బందికి - పోలీసులకి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. రోజా గారిని ఆదర్శంగా తీసుకోని ..ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గంలో ఈ విధానాన్ని అనుసరిస్తే ..రాష్ట్రంలో ఆకలి తో పస్తులు పడుకునే వారే ఉండరు.