Begin typing your search above and press return to search.
రోజా క్షమాపణ చెప్పేసింది!
By: Tupaki Desk | 6 April 2016 11:12 AM GMTవైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పింది. ఏపీ అసెంబ్లీ కమిటీహాలులో జరిగిన ప్రివిలేజ్ కమిటీ విచారణ కొద్ది సేపటి క్రితం ముగిసింది. టీడీపీ నేతలు సభలో తనను టార్గెట్ చేసి మాట్లాడారని చెప్పిన రోజా... తన మాటలకు అనిత బాధపడి ఉంటే క్షమించాలన్నారు. సీనియర్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ విచారణ జరిగింది.
వైసీపీ ఎమ్మెల్యే రోజా తనను క్షోభకు గురిచేసేలా మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమెపై ఏడాది కాలం పాటు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రోజాతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ తప్పుపట్టింది. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు - సుప్రీంకోర్టులో పోరాటం చేశారు. శాసనసభ - న్యాయస్థానాల మధ్య ఉన్న పరిధుల మేరకు రోజా సస్పెన్షన్ విషయంలో ఆదేశాలు ఇవ్వడం సబబు కాదని కోర్టులు తేల్చాయి. ఈ నేపథ్యంలో రోజా క్షమాపణ చెప్పే అవకాశం కల్పించగా...ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై రోజా వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పారు.