Begin typing your search above and press return to search.

వైఎస్ జ‌గ‌న్ కు వివ‌ర‌ణ ఇచ్చుకున్న ఆర్కే రోజా?

By:  Tupaki Desk   |   10 Jan 2020 8:26 AM GMT
వైఎస్ జ‌గ‌న్ కు వివ‌ర‌ణ ఇచ్చుకున్న ఆర్కే రోజా?
X
న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్కే రోజా ప‌ట్టు స‌డలుతోంది అనే అభిప్రాయాల‌ను క‌లిగించింది ఇటీవ‌లే జ‌రిగిన ఒక గొడ‌వ‌. నియోక‌వ‌ర్గంలో రోజాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫునే ఒక తిరుగుబాటు లాంటింది జ‌రిగింది. వైసీపీ కార్య‌క‌ర్త‌లే ఆమెకు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన వైనం వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

*జ‌గ‌న‌న్న అమ్మ ఒడి* కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వంలో ముఖ్య‌మంత్రితో రోజా చాలా సీరియ‌స్ గానే డిస్క‌స్ చేసింది. జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. త‌న గోడును ఆయ‌న‌కు వెల్ల‌బోసుకుంది రోజా. కాస్త ర‌హ‌స్యంగానే ఆయ‌నకు ఆమె అన్ని వివ‌రాల‌నూ చెప్పుకున్న‌ట్టుగా తెలుస్తూ ఉంది.

అయితే రోజాపై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఇప్ప‌టిది ఏమీ కాదు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇలాంటి ప‌రిణామాలు జ‌రిగాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో అస‌లు రోజుకు టికెట్టే ఇవ్వ‌కూడ‌ద‌ని కొంత‌మంది వైసీపీ నేత‌లు డిమాండ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌నేత‌గా ఉన్న ఒక సీనియ‌ర్ నేత రోజాకు వ్య‌తిరేకంగా అప్పుడే పావులు క‌దిపార‌ట‌. ఆమెకు టికెట్ ఇవ్వ‌డానికి వీల్లేద‌ని ఆయ‌న జ‌గ‌న్ ద‌గ్గ‌ర వ్యాఖ్యానించిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే జ‌గ‌న్ పై విధేయ‌త అప్పుడు రోజాను కాపాడింది. ఆమెకు టికెట్ ద‌క్కేలా చేసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ రోజా విష‌యంలో ఆ పెద్ద నేత పావులు క‌దుపుతూ ఉన్నార‌ని టాక్.

ఈ విష‌యాన్నే వైఎస్ జ‌గ‌న్ కు మొర‌పెట్టుకుంద‌ట రోజా. త‌న‌కు వ్య‌తిరేకంగా నియోజ‌క‌వ‌ర్గంలో కుట్ర చేస్తున్నార‌ని ఆమె వాపోయింద‌ట‌. ఆమె బాధ‌ను విన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి..అంద‌రినీ కూర్చోబెట్టి మాట్లాడ‌తానంటూ హామీ ఇచ్చిన‌ట్టుగా స‌మాచారం.