Begin typing your search above and press return to search.
కోడెలను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసిన రోజా
By: Tupaki Desk | 7 Sep 2016 7:01 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తన సస్పెన్షన్ పై రోజా స్పందించినట్లుగా వార్తలు వస్తుండగా తాజాగా ఆమె స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును వ్యక్తిగతంగా ఈ మేరకు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కోడెలను ఆయన నివాసంలో కలిసిన రోజా తాను క్షమాపణ లేఖ ఇచ్చినందున సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారని సమాచారం. ఒకవేళ అలా కాని పక్షంలో తమ అసెంబ్లీ ఆవరణలోని వైసీపీ శాసన సభా పక్ష కార్యాలయం వరకైనా అనుమతించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
అయితే దీన్ని సభాపతి కోడెల శివప్రసాద రావును సున్నితంగా తిరస్కరించారని సమాచారం. సస్పెన్షన్ ఏ విధంగా తన ఒక్కడి నిర్ణయం కాదో...దాన్ని ఎత్తివేయడం కూడా తన పరిధిలో లేదని స్పీకర్ వివరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత జరిగే బీఏసీ - సమావేశాల సందర్భంగా నిర్ణయిస్తారని కోడెల చెప్పినట్లు చెప్పారని సమాచారం. మరోవైపు రోజా క్షమాపణ ఎపిసోడ్ కు పుల్ స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. తాజా అసెంబ్లీ చివరిరోజు ఈ విషయం సభలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ విషయంలో ధీటుగా వ్యవహరించాలని భావిస్తున్నట్లుగా సమాచారం.