Begin typing your search above and press return to search.
అవును.. రోజా అరెస్ట్ కాలేదు
By: Tupaki Desk | 1 Oct 2017 4:45 AM GMTప్రముఖ సినీ నటి.. ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ముందు.. వెనుక చూసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిన సోదిని యథాతధంగా డంప్ చేసిన ప్రముఖ దినపత్రికలు.. ఛానళ్ల పుణ్యమా అని ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. తనను అరెస్ట్ చేయలేదని.. తాను పాల్గొన్న ప్రోగ్రాం చాలా బాగా జరిగిందని.. తాను ఎంచక్కా తన స్నేహితుల ఇంట్లో ఉన్నట్లుగా చెప్పిన రోజా.. అందుకు సంబంధించిన వీడియో సందేశాన్ని పంపారు.
కువైట్ లోని హోటల్ లో జరిగిన నవరత్నాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా అభిమానులు భారీగా నినాదాలు చేయటంతో.. స్థానికులు ఫిర్యాదు చేశారని.. దీంతో నిర్వాహకుల్ని.. రోజాను అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే.. ఇందులో సగం మాత్రమే నిజమని ఆర్కే రోజా స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ విభాగం సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనుకున్న దాని కంటే భారీగా వచ్చారని.. దాదాపు 2 వేల మంది వరకూ హాజరు కావటంతో పోలీసులు వచ్చారన్నారు.
అక్కడ పది మంది కలిసినా గుంపుగా భావిస్తారని.. అలాంటిది పెద్ద ఎత్తున అభిమానులు రావటంతో అంతమందికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారే తప్పించి మరెలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఈ కార్యక్రమానికి తాను అతిథిగా మాత్రమే వచ్చానని చెప్పారు. పోలీసులకు నిర్వాహకులకు మధ్యన ఇష్యూనే తప్పించి.. ఇంకెలాంటి సమస్యా లేదన్నారు.
నవరత్నాల కార్యక్రమం చాలా బాగా జరిగిందన్నారు తానిప్పుడు స్నేహితుల ఇంట్లో ఉన్నట్లుగా వీడియో సందేశంలో స్పష్టం చేశారు. తాను అరెస్ట్ అయ్యానంటూ వార్తలు వస్తున్నాయని.. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని.. అనవసరమైన గందరగోళానికి గురి కావాల్సి అవసరం లేదని చెప్పారు. రోజా వీడియోతో సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారానికి చెక్ పడినట్లైంది.