Begin typing your search above and press return to search.
దమ్మున్న మగాళ్లు అయితే..అంటూ దులిపేసింది
By: Tupaki Desk | 11 Feb 2017 9:34 AM GMTకొన్ని తప్పులు అస్సలు జరగక్కూడదు. అందుకు ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకోవాలి. అంతేకానీ.. అత్యుత్సాహంతో వ్యవహరిస్తే లేనిపోని తలనొప్పులు ఎదురవుతాయి. తాజాగా జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజావిషయంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు రోజాను ఆహ్వానించింది ఏపీ సర్కారు. ఆ ఆహ్వానంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోదిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవం.. ఆ తర్వాత ఆమెను రహస్యంగా తరలించటంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.
తనను వాహనంలో తరలిస్తున్న పోలీసుల తీరును రికార్డు చేసిన రోజా.. కొన్ని వీడియోలను మీడియా ఛానళ్లకు పంపారు. ఈ సందర్భంగా ఆమె కొన్నిప్రశ్నలు సంధించారు. తనను పిలిచి మరీ అవమానించిన తీరుపై ఏపీ ముఖ్యమంత్రిని..స్పీకర్ ను ఆమెతీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. రమ్మనటం ఎందుకు? ఇలా అవమానించటం ఎందుకు? అని అడుగుతున్న ఆమె.. తామేమీ సదస్సుకు వస్తామని అడగలేదంటున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న రోజా ఏపీ సర్కారును కొన్నిసూటి ప్రశ్నలు సంధించారు. వాటిని చూస్తే..?
= అహ్వానం పంపి.. మరీ ఎందుకిలా అడ్డుకున్నారు?
= ఏ కారణం చేత నన్ను అదుపులోకి తీసుకున్నారు? ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా ఇలా వాహనంలో తిప్పటం ఏమిటి?
= హోటల్ కు పంపుతున్నట్లు చెప్పి.. విమానాశ్రయం వెనుక గేటు నుంచి తీసుకెళ్లటం ఏమిటి?
= మహిళల సాధికారత అంటూ సదస్సులు పెట్టేసి.. వాటికి వచ్చినమాలాంటి వాళ్లను అవమానించటమే ఏమిటి?
= మిమ్మల్ని సూటిగా ప్రశ్నించే వారిని సదస్సులకు ఆహ్వానించకుండా.. మిమ్మల్ని భజన చేసే వాళ్లను మాత్రం ఆహ్వానిస్తారా?
= చంద్రబాబు కోడలు.. వెంకయ్య కూతురు.. కేసీఆర్ కుతూర్ని పిలిచిన చంద్రబాబు.. మాలాంటి ఎమ్మెల్యేల్ని ఎందుకు రానివ్వటం లేదు?
= భజన చేసే వారికి మాత్రమే సదస్సుకు రానిస్తారా?
= రాకూడదనుకుంటే.. సదస్సుకు రావాలంటూ ఇన్విటేషన్ కార్డు ఎందుకు పంపినట్లు..?
= ఈ సదస్సు కోసంరూ.13కోట్లు ఖర్చు పెడుతున్నారు. సదస్సు పేరుతో అమరావతిని చూపిస్తూ.. డబ్బాలు కొట్టించుకోవటానికే కానీ.. ప్రశ్నలు అడిగే మాలాంటి వాళ్లను ఎందుకు అనుమతించటం లేదు?
= ప్రశ్నలు వేసే బృందాకారత్.. మేధాపాట్కర్ లాంటి వాళ్లను ఎందుకు ఆహ్వానించలేదు?
దమ్మున్న మగాళ్లు అయితే’.. అంటూ దులిపేసింది
ఈ నేపథ్యంలో రోజా కొన్ని వీడియో క్లిప్ లను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. తనను అన్యాయంగా అదుపులోకి తీసుకున్న పోలీసులపైనా.. ఏపీ ముఖ్యమంత్రి.. స్పీకర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రోజా పోస్ట్ చేసిన కొన్ని వీడియో క్లిప్పుల్లోఆమె ఏమన్నారన్నది ఆమె మాటల్లోనే చూస్తే..
‘‘దమ్మున్న మగాళ్లు అయితే.. నాలాంటోళ్లను.. వనాజాక్షి.. రితికేశ్వరి తల్లిదండ్రుల్ని.. బృందాకారత్ లాంటి వాళ్లను పిలిపించి మహిళా సాధికారత మీద మాట్లాడిస్తే.. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సీఎంగారు.. స్పీకర్ గారు మహిళల్నిఎలా గౌరవిస్తున్నారు.. వాళ్లను ఎంత మాత్రం ఎదిగే అవకాశం ఇస్తున్నది రాష్ట్రప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ.. ఇంత పిరికివాళ్లు..ఇంత భయపడేవాళ్లను నేనెక్కడా.. ఏ రాష్ట్రంలోనూ చూడలేదు’’
‘‘చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా రాజధాని అడ్డాగా పెట్టుకొని ఉన్న నాటి నుంచి క్రైం రేట్ 11 శాతం పెరిగిందని డీజీపీ సాంబశివరావు చెప్పారు. కల్తీ మద్యం వల్ల ఎంతోమంది మహిళలు భర్తల్ని పోగొట్టుకున్నారు. కాల్ మనీ రాకెట్ లో ఎంతోమంది మానప్రాణాలు పోగొట్టుకున్నారు. అలానే ఎక్కడి నుంచో చదువుకోవటానికి వచ్చిన రితికేశ్వరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు’’
‘‘వనజాక్షి లాంటి ఆఫీసర్ ను కొడితే కూడా కేసు లేని పరిస్థితి ఈ రోజు ఉంది. నారాయణ కాలేజీలో ఎంతోమంది అమ్మాయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వారిపైన కేసులు పెట్టి ఎవరి వల్ల వారు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న విచారణ కూడా చేయటం లేదు. నారాయణను పక్కన పెట్టుకున్నారు. కోట్ల కోసమంటే ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. సీఎం చంద్రబాబు కానీ.. స్పీకర్ కానీ ఆంధ్రప్రదేశ్ లోమహిళల మీద అత్యాచారాలతో.. ఆఘాయిత్యాలతో నేరాల అడ్డాగా మార్చేశారు. ఈ రోజు సేష్టీ లేని స్టేట్ ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశేనని ప్రతిఒక్కరూ తెలుసుకునేలా చేశారు.మహిళా పార్లమెంటు సదస్సుకు వచ్చే ప్రతి మహిళా..ఈ రాష్ట్రంలోమహిళలకు జరిగే అన్యాయాల్ని ప్రశ్నించి బుద్ధి చెబితేనే మహిళా సాధికారత సదస్సుకు ఒక సార్థకత ఉంటుందని భావిస్తున్నా’’