Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కే అన్నం పెట్టని భువనేశ్వరి..రాజధాని రైతులకు పరమాన్నం పెడుతుందా?

By:  Tupaki Desk   |   3 Jan 2020 11:48 AM GMT
ఎన్టీఆర్‌ కే అన్నం పెట్టని భువనేశ్వరి..రాజధాని రైతులకు పరమాన్నం పెడుతుందా?
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ..ఆంధప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే వికేంద్రీకరణ జరగాలి అని - అందులో భాగంగా ఏపీకి మూడు రాజధానులు పెడితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇక అప్పటి నుండి రాజధాని రైతులు రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అని ఆందోళనకి దిగారు. ఎప్పుడెప్పుడా అని సమయం కోసం వేచి చూస్తున్న టీడీపీ నేతలు ..ఆ అగ్గి లో మరింత పెట్రోల్ పోసి ఆ ఆందోళనలని ఉదృతం చేసేలా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం టీడీపీ నేతలు భూములు చాలావరకు అమరావతిలోని ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అమరావతి నుండి తరలిపోతే వారికీ నష్టం కాబట్టి ..రైతులకే తమ మద్దతు - ఏపీ రాజధాని అమరావతినే అంటూ కలరింగ్ ఇస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

మూడు రాజధానులు అని సీఎం జగన్ చెప్పారు ..కానీ , అమరావతి నుండి పూర్తిగా రాజధానిని తరలిస్తాం అని చెప్పలేదు. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తాం అంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇలా చేసినందుకే తెలుగు ప్రజలకి వారికీ తగిన బుడ్డి చెప్పారనే విషయాన్ని మరచిపోయినట్టు ఉన్నారు. ఆంధప్రదేశ్ అంటే ఒక్క అమరావతినే కాదు ..ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటితో పాటుగా అమరావతి ని కూడా అభివృద్ధి చేస్తాం అని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు.

ఇకపోతే , రాజధాని అమరావతి కోసం సాగుతున్న పోరాటంలో భాగంగా ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు చంద్రబాబు - భువనేశ్వరి దంపతులు. ఇద్దరూ రైతులకు భరోసా ఇచ్చారు. అండగా ఉంటామని చెప్పారు. అంతే కాదు చంద్రబాబు అమరావతి కోసం - పోలవరం కోసం పరితపించారని చెప్పిన ఆమె ఇంతమంది మహిళలు రోడ్డుపైకి రావడం తొలిసారి‌ చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి జేఏసీకి తన చేతి గాజు విరాళంగా ఇచ్చి భరోసా ఇచ్చారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానికి భూములు లాక్కున్నప్పుడు బయటకు రాని భువనేశ్వరి.. ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు.

ఇక తాజాగా భువనేశ్వరీ వ్యవహారం పై వైసీపీ నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి - తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి రాజధాని అమరావతి కోసం భువనేశ్వరి గాజులు కాదు ఇవ్వాల్సింది తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేయ్యాలని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.