Begin typing your search above and press return to search.
పవన్ కు గుండు నిజమేఃరోజా
By: Tupaki Desk | 15 Dec 2017 7:58 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుండు వార్త మరోమారు తెరమీదకు వచ్చింది. ఇటీవల ఏపీలో పర్యటించిన జనసేన చీఫ్ పరిటాల రవి తనకి గుండు కొట్టించిన విషయాన్ని ప్రస్తావించారు.తనకెవరూ గుండు కొట్టించలేదని...తనే చికాకు పుడితే అలా గుండుగీయించుకున్నానని వెల్లడించారు. స్వయంగా పవన్ కల్యాణ్ గుండు వ్యవహారంపై క్లారిటీ ఇవ్వడంతో మరోమారు ఆ వార్త తెరమీదకు వచ్చింది. అప్పటి నుంచి పవన్ ‘గుండు’పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మంత్రి పరిటాల సునీత కూడా ఈ విషయంపై స్పందించారు. అసలు తన భర్త పవన్ కు గుండు కొట్టించలేదని తెలిపారు.
ఈవిషయం సద్దుమణిగిందనుకునే సమయంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పవన్ కల్యాణ్ గుండుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఎజెండా ఏమిటో ఆయ అభిమానులకే అర్థం కావడంలేదన్నారు. పవన్‌కు టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనన్నారు. తానప్పుడు టీడీపీలోనే ఉన్నానని తెలిపారు. అయితే ఆ విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. పవన్ చెప్పిన తేదీలను బట్టి చూస్తే గుండు నిజమేనని నమ్మొచ్చని రోజా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో రోజా స్పందించారు. 2014లో పవన్ కు టీడీపీ మరోమారు గుండు కొట్టించిందని - 2019లో మళ్లీ అదే పని చేయడం ఖాయమని ఆమె సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని టీడీపీతో జాగ్రత్తగా ఉంటే మేలని సూచించారు.
కాగా, ఇప్పటికీ తనకు టీడీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని - ఆ పార్టీలో చేరాలని పలువురు నేతలు కోరుతున్నారని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. తనకు ఎవరి ద్వారా ఈ ప్రతిపాదన వచ్చిందనేది సరైన సమయంలో వెల్లడిస్తానని ఆమె తెలిపారు. వైసీపీ రెడ్ల పార్టీగా మారిపోయిందనే విషయాన్ని తాను అంగకీరించనని రోజా అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రమిస్తున్నారని అన్నారు. వైసీపీని ఎదుర్కోలేని వారే..ఇలాంటి కామెంట్లు చేస్తారని రోజా స్పష్టం చేశారు.