Begin typing your search above and press return to search.
రోజా కామెంట్: పాదయాత్రపై బాబు కుట్ర
By: Tupaki Desk | 2 Nov 2017 12:44 PM GMTవైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచింది. ఈ అంశం కేంద్రంగా చేసుకుని కౌంటర్లు ఎన్ కౌంటర్లు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఏం తగ్గడం లేదు. తాజాగా వైసీపీ నేత రోజా కాస్త ఘాటుగా తనదైన శైలిలో స్పందించారు. జగన్ పాదయాత్ర.. సీఎం చంద్రబాబులో గుండె దడ పెంచిందని ఆమె అన్నారు. అందుకే జగన్ పాదయాత్రపై టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆ కుట్రలను ప్రజలతో పాటు పోలీసులు తిప్పికొట్టాలని రోజా పిలుపు నిచ్చారు.
హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీ నేతల దుమ్ము దులిపారు. ‘వైఎస్ జగన్ పాదయాత్ర టీడీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర. పాదయాత్రకు భయపడే చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. ఆయన నరనరాన కుట్రలు - కుతంత్రాలే ఉన్నాయి. ఓటుకు కోట్లు కేసుతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడ్డారు. తుని విధ్వంసం టీడీపీ పనేనని నివేదిక వచ్చింది. కాంగ్రెస్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసింది నిజం కాదా?`` అని విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం జగన్ చేపట్టనున్న పాదయాత్రపై బాబు కన్ను పడిందని, దీనికి అడ్డుతగలాలని ఇప్పటికే నేతలను పురమాయించారని చెప్పారు. జగన్ తన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసాలను - కుట్రలను వివరిస్తారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసే హక్కు జగన్ కు ఉందన్నారు. 50 ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపే బాబు కుట్రను వైసీపీ భగ్నం చేసిందని, దీంతో బాబు అలాంటిదేమీలేదని బొంకారని, ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు.
తప్పులు చేయడం కేంద్రం కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజంగా మారిందని రోజా ఎద్దేవా చేశారు. జగన్ ప్రజా సంకల్పాన్ని ప్రజలు విజయవంతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పంతో టీడీపీకి కౌంట్ డౌన్ మొదలైందని రోజా హెచ్చరించారు. మొత్తానికి టీడీపీ సర్కారు సహా పార్టీ అధినేత చంద్రబాబుపై రోజా తనదైన శైలిలో కామెంట్లు కురిపించారు. కాగా, నిన్న జగన్ పాదయాత్ర విజయ వంతం కావాలని కోరుతూ.. రోజా పూజలు చేసిన విషయం తెలిసిందే.