Begin typing your search above and press return to search.

కాల్లు పట్టుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   3 Feb 2022 4:39 AM GMT
కాల్లు పట్టుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X
అభివృద్ధి కోసం అవసరమైతే కాల్లు పట్టుకుంటానంటూ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవిప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అనకాపల్లి అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలను సాకుగా చూపి కోర్టులకు ఎక్కి స్టేలు తీసుకురావడం సరికాదన్నారు. దేశంలోనే ఉన్నత జిల్లాగా తీర్చిదిద్దుతామని.. అనకాపల్లిని కనకపల్లిగా మార్చుతామని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.

ఏ ఒక్కరి వల్లనో అభివృద్ధి ఆగిపోకూడదు.. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారి కాళ్లు పట్టుకుంటానని ఎమ్మెల్యే అమర్ నాథ్ అన్నారు. ఇప్పటికైనా కేసులు ఉపసంహరించుకోవాలన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లిని జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారన్నారు. నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా చేయాలని.. పెందుర్తిని విశాఖలో కలపాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారన్నారు.

అనకాపల్లిని జిల్లా కేంద్రం చేసినందున వైద్య కళాశాలను తమకే కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని అమర్ వివరించారు. అనకాపల్లి అందరికీ అందుబాటులో ఉంటుందని వివరించారు. జాతీయ రహదారి, సముద్రతీరం, బెల్లం మార్కెట్, ఎస్ఈజెడ్, ఫార్మాసిటీ ఇలా అనేక ప్రత్యేకతలు అనకాపల్లిజిల్లాకు ఉన్నాయన్నారు. అందువల్లే దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.

అనకాపల్లికి రూ.500 కోట్లతో వైద్య కళాశాల, ఆస్పత్రి మంజూరు చేయిస్తే సాంకేతిక లోపాలను చూపించి న్యాయస్థానం నుంచి స్టేలు తీసుకొచ్చి ఆటంకాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేకో, ముఖ్యమంత్రికో పేరు వస్తుందని తాము పనిచేయడం లేదని.. భావితరాల భవిస్యత్తు కోసం చేస్తున్నామని అమర్ వివరించారు. అనకాపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించినందుకు సంఘీభావ ప్రదర్శన నిర్వహిస్తామని పేర్కొన్నారు.

అనకాపల్లి జిల్లా లొల్లి ముదిరింది. దీనికి అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యేలు.. వ్యతిరేకంగా వైరి వర్గాలు కాచుకు కూర్చున్నాయి. దీంతో పాటు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది.