Begin typing your search above and press return to search.
చంద్రబాబు నీకు కొంచమైనా సిగ్గుందా ..!
By: Tupaki Desk | 26 Nov 2019 1:49 PM GMTఏపీలో రాజకీయం ప్రస్తుతం అట్టుడుకుతోంది. ఒకవైపు వలసల రాజకీయం , మరోవైపు టీడీపీ , వైసీపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రం హోరెత్తిపోతుంది. మొన్నటి వరకు ఇసుక సమస్య పై రాద్దాంతం చేసిన ప్రతిపక్షాలు ఆ సమస్య తీరిపోగానే ..ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పై రచ్చ చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబు కడప జిల్లాలో అడుగుపెట్టాడు. కడప జిల్లాలో ఈసారి టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. గత ఎన్నికలలో టీడీపీ ఒక్క సీటు గెలుచుకోగా ..ఈసారి ఆ సీటు కి వైసీపీలోకి చేరింది. దీనితో కడప లో పార్టీని మరింత పటిష్టంగా చేయాలనీ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కడప పర్యటనకి వచ్చిన నేపథ్యంలో అయన పై ప్రభుత్వ చీఫ్ విప్..ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకి ఏ మొఖం పెట్టుకొని వచ్చారంటూ మండిపడ్డారు. ప్రతి సారి కడప రౌడీలు, రాయలసీమ రౌడీలు, పులివెందుల పంచాయితీలు అంటూ రాయలసీమ ప్రజలను తీవ్రంగా అవమానించిన చంద్రబాబు ఏ విధంగా కడప జిల్లాలో అడుగుపెడతావు అని , ప్రజలు అంతలా ఛీ కొట్టిన సిగ్గురాలేదా , కడప కి ఏమి చేసావని మళ్లీ కడపలో అడుపెట్టావ్ అంటూ మండిపడ్డారు. అలాగే కడపలో బాబు కి స్వాగతం పలికిన టీడీపీ నేతలపై కూడా సంచలన కామెంట్స్ చేసారు. అలాగే ముందు కడప జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాక కడపలో అడుగుపెట్టాలి అంటూ డిమాండ్ చేసారు.
సిగ్గులేకుండా చంద్రబాబు జమిలీ ఎన్నికలు వస్తాయని మళ్లీ మాయ మాటలు చెపుతున్నాడు అని , మొన్నటి ఎన్నికలలో కనీసం 23 సీట్లు అయినా వచ్చాయి. ఇక ఈసారి ఎన్నికలు వస్తే ..ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే బాబు ఎప్పుడు మాతో పెట్టుకుంటే మటాష్ అని అంటారని , గతంలో మాతో పెట్టుకుంటే మాటాష్ అయిపోతారని రాజశేఖర్ రెడ్డిని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన ప్రమాదంలో చనిపోయారు అని చంద్రబాబు మాటాష్ అంటున్న వ్యాఖ్యలు పై విచారణ జరిపించాలి అని కోరారు.
ఇక సీఎం జగన్ ని ప్రతి వారం కోర్టుకి పోతున్నాడు అని హేళన చేస్తున్నారని , అయన ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ..నిర్భయంగా కోర్టుకి హాజరవుతున్నారని , కానీ, నువ్వు కోర్టు నుంచి 26 స్టేలు తెచ్చుకొని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రగల్భాలు పలుకుతున్నారని , వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను పట్టుకొని ఆంబోతు అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు అని , వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబే ఆంబోతులా వ్యవహారిస్తున్నారు అంటూ అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి లక్షలాది ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు కావని , వైసీపీ ఇచ్చే బిస్కెట్స్ అని , వాటిని మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే తీసేస్తామని అంటున్నారు అంటూ చెప్పారు. అలాగే త్వరలోనే వివేకానందరెడ్డి హత్యపై అన్ని వాస్తవాలు బైటకు వస్తాయి అని తెలిపారు.
ఇక గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసిన చంద్రబాబు. ఇప్పుడు విమర్శిస్తే ఎక్కడ కేసులు బయటకి తీస్తారో అని మోడీకి భయపడి పిల్లిలా నోరు మెదపడం లేదు అని , అలాగే గతంలో బాలకృష్ణతో మోడీని నోటికొచ్చినట్లుగా తిట్టించావు,అమిత్ షా పై తిరుపతి లో రాళ్ళ దాడి చేయించావు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.అలాగే కడప కి స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకున్నది కూడా చంద్రబాబే అని , రాజశేఖర్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి సన్నాహాలు చేస్తుంటే , ఆ ప్రాంతంలో నెమళ్లు ఉన్నాయంటూ తప్పుడు వార్తలు సృష్టించారని తెలిపాడు.
ఇక టీడీపీ దత్త పుత్రుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నారని , అయన ఏమి మాట్లాడతారో కనీసం ఆయనకి అయిన అర్థం కావడంలేదు అని పవన్ పై విరుచుకుపడ్డారు. అలాగే ఓటుకి నోటు కేసులో బయపడి అప్పటికప్పుడు రాజధానిని అమరావతికి షిఫ్ట్ చేయించారని , కేసుల విషయంలో చంద్రబాబు భయపడి పారిపోయి వచ్చాడని , ఇప్పుడు తన మాటలతో అధికారులను భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.