Begin typing your search above and press return to search.
టీడీపీ ల్యాండ్ మాఫియాకు వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్?
By: Tupaki Desk | 16 Sep 2019 2:30 PM GMTతెలుగుదేశం పార్టీ బాగా అపకీర్తి పెంచుకున్నతి ల్యాండ్ డీల్స్ వల్లనే. తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన భూ ఆక్రమణలు, సెటిల్మెంట్ల వల్లన ఆ పార్టీ ప్రజల్లో బాగా పలుచన అయ్యింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడానికి నాలుగైదు కారణాలను చెప్పినా.. అందులో ఆ పార్టీ నేతలు చేసిన ల్యాండ్ డీలింగ్స్ ను ప్రస్తావించాల్సి ఉంటుంది. భూ ఆక్రమణలను పెద్ద మాఫియాగా మార్చి, దాన్ని తమ సంపాదనకు మార్గంగా మలుచుకున్నారు.. తెలుగుదేశం పార్టీ నేతలు. దీంతో తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తింది.
ఇక జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకా ల్యాండ్ డీల్స్ చాలా వరకూ ఆగాయి. ల్యాండ్ డీల్స్- ల్యాండ్ మాఫియాలకు జగన్ గట్టిగా చెక్ చెప్పారు. తమ పార్టీ నేతలు అలాంటి వాటిల్లో తలదూర్చడానికి వీల్లేదని జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అవినీతి రహిత పాలన అంటే.. అన్ని రకాలుగానూ అవినీతి రాహిత్యంగా ఉండటమే అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను అలా కట్టడి చేశారు.
అయితే అలాంటి కట్టు అక్కడక్కడ తప్పుతూ ఉంది. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు భూ ఆక్రమణల వ్యవహారంలో వేలు పెడుతూ ఉండటమే అందుకు రుజువు. తన నియోజకవర్గంలో పరిధిలో ఆయన భూ దందాలు సాగిస్తూ ఉన్నారని సమాచారం.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ ప్రాంతంలో ల్యాండ్ డీల్స్ ను నేతలు చేశారు. ఆ పనే ఈ వైసీపీ ఎమ్మెల్యే కూడా చేస్తున్నారట. అప్పుడు కొనసాగి, ఎన్నికల సమయం నుంచి ఆగిన పలు ల్యాండ్ డీల్స్ ను ఈయన టేకప్ చేసినట్టుగా సమాచారం. పెండింగ్ లో ఉన్న సెటిల్మంట్ పై ఈయన దృష్టి పెట్టారట.. వాటిని తను సెటిల్ చేస్తానంటూ పిలిపించుకుంటున్నాడట. ఈ ఎమ్మెల్యే కార్యకలాపాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి వరకూ కూడా నివేదికలు వెళ్లినట్టుగా సమాచారం. మరి ల్యాండ్ మాఫియాలకు సపోర్ట్ గా నిలుస్తున్న ఈ ఎమ్మెల్యేకు సీఎం నుంచి అక్షింతలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.